News August 12, 2024
అలంపూర్ ఆలయాల్లోకి వాహనాలు నిషేధం..!
అలంపూర్ బాల బ్రహ్మేశ్వర దేవస్థానంలోకి నేటి నుంచి వాహనాలకు అనుమతి ఇవ్వడం లేదని దేవస్థానం ఈవో పురేంద్ర కుమార్ తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వీఐపీలు కూడా బయట పార్కింగ్ ప్రాంగణంలో గ్యాలరీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అలాగే వీటితోపాటు పురావస్తు శాఖ స్థల ప్రదర్శనశాల, నవబ్రహ్మ ఆలయాలు వెళ్లే మార్గానికి భక్తులు, సందర్శకుల సౌకర్యంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు.
Similar News
News September 20, 2024
వనపర్తి: BRS సీనియర్ నాయకుడి మృతి
వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణానికి చెందిన BRS సీనియర్ నాయకుడు నాగరాల శ్రీనివాస్ రెడ్డి అనారోగ్య కారణంతో శుక్రవారం మృతిచెందారు. విషయం తెలుసుకున్న దేవరకద్ర మాజీ శాసనసభ్యుడు ఆల వెంకటేశ్వర్ రెడ్డి వారి నివాసానికి వెళ్లి ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
News September 20, 2024
మహబూబ్‌నగర్: తండ్రిని చంపేశాడు..!
ఓ యువకుడు తండ్రిని హత్య చేశాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. రాజాపూర్ మండలం రాయపల్లికి చెందిన కావలి నారాయణని అతడి కుమారుడు నందు హత్య చేశాడు. గురువారం రాత్రి అందరూ పడుకున్నాక గొడ్డలితో నరికి చంపాడు. నందుకు కొంత కాలంగా మతిస్థిమితం లేదు. ఏ పని చేయకుండా ఊర్లో తిరుగుతుండేవాడు. కాగా రోజూ నారాయణ ఇంటికి గొళ్లెం పెట్టుకునేవాడు. రాత్రి పెట్టుకోకపోవడంతో అదును చూసి చంపేయగా నందును పోలీసులు అరెస్ట్ చేశారు.
News September 20, 2024
MBNR: మధ్యాహ్న భోజన బిల్లులు రూ.1.94 కోట్లు విడుదల
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న మధ్యాహ్న భోజన బిల్లులకు సంబంధించిన నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కోడి గుడ్ల కోసం రూ.1.94 కోట్లు విడుదల చేసింది. జిల్లా విద్యాశాఖ అధికారులు ఆయా పాఠశాలల్లో మధ్యాహ్న భోజన కార్మికుల ఖాతాలో ఈ నిధులు జమ చేయనున్నారు. దీంతో వంట కార్మికుల ఇబ్బందులు తొలగనున్నాయి.