News August 7, 2024
అలంపూర్ ఎమ్మెల్యే అరెస్టుపై స్పందించిన కేటీఆర్
అలంపూర్ BRS MLA విజయుడిని పోలీసులు అరెస్టు చేయడంపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ట్విట్టర్(X) ద్వారా స్పందించారు. ‘ప్రజా పాలనలో మన ప్రజాప్రతినిధులు రోజు అవమానాలకు గురవుతున్నారు. మా ఎమ్మెల్యే విజయుడిని అవమానించిన జిల్లా అధికారుల దౌర్జన్యాన్ని ఖండిస్తున్నాను. అన్ని అధికారిక సమావేశాలు, కార్యక్రమాలకు ప్రజలచే తిరస్కరించబడిన కాంగ్రెస్ పార్టీ నాయకులను ఆహ్వానించడానికి కారణం ఏమిటి?’ అని CSను ట్యాగ్ చేశారు.
Similar News
News September 11, 2024
తెలంగాణలో కషాయ జెండా ఎగరడమే లక్ష్యం: డీకే అరుణ
తెలంగాణలో కషాయ జెండా ఎగరవేయడమే ధ్యేయంగా ముందుకు సాగాలని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. నేడు మల్కాజ్గిరి, మేడ్చల్ జిల్లాలలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. డీకే అరుణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యమని అన్నారు. దేశ సాంస్కృతి సాంప్రదాయాలను కాపాడడానికి ప్రతి కార్యకర్త 200 మందిని సభ్యత్వంలో చేర్పించాలని అన్నారు.
News September 11, 2024
MBNR: ఈనెల 12 న స్పాట్ అడ్మిషన్లు
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి 5వ,9వ తరగతిలో మిగులు సీట్ల భర్తీకి ఈనెల 12న స్పాట్ అడ్మిషన్లు చేపడుతున్నట్లు ఉమ్మడి జిల్లాల జోనల్ అధికారి నిర్మల మంగళవారం తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా NRPT, MBNR, GDL, WNPT, NGKL జిల్లాల్లోనిగురుకుల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు తీసుకుంటున్నట్లు తెలిపారు.
News September 11, 2024
MBNR: ‘గమ్యం యాప్.. సమయాన్ని ఆదా చేస్తుంది’
మహబూబ్ నగర్ టీఎస్ఆర్టీసీ ‘గమ్యం యాప్’ తో మీ ప్రయాణ సమయం ఎంతో ఆదా అవుతుందని ఆర్టీసీ డిపో మేనేజర్ సుజాత మంగళవారం తెలిపారు. పట్టణంలోని గణేష్ మండపాల దగ్గర మహబూబ్ నగర్ ఆర్టీసీ విలేజ్ బస్ ఆఫీసర్స్ మార్కెటింగ్ అయిన సీజన్ టికెట్, తిరుపతి దర్శనం, వివాహ శుభ కార్యాలు, విహారయాత్రల ప్రత్యేక బస్సులు తదితర విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.