News September 13, 2024
అలంపూర్: చాలాకాలం తరువాత గుర్తించారు..!
అలంపురంలోని బాల బ్రహ్మేశ్వర ఆలయం లో ఉన్న ద్వారపాలకుల విగ్రహానికి ఈఓ పురేందర్ కుమార్ రంగులు వేయిస్తున్నారు. 60ఏళ్ల క్రితం కళ్ళే రంగస్వామి(కుంటి రంగస్వామి)అనే స్థానిక కళాకారుడు ఈ ద్వారపాలకుల విగ్రహాలను స్వయంగా చేశారు. మంచి రూపలావణ్యం కలిగిన విగ్రహాలను భక్తులు గుర్తించలేకపోతున్నారంటూ ఈవో వాటికి పేయింటింగ్ చేయించారు. ఇంతకాలానికి గుర్తించినందుకు ధన్యవాదాలంటూ కళ్లె వంశీయులు రంగ అన్నారు.
Similar News
News October 7, 2024
MBNR: గ్రామాల్లో మొదలైన ‘పంచాయతీ’ సందడి!
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా పంచాయతీల్లో సర్పంచ్‌గా పోటీ చేయాలనుకునే ఆశావహులు అందరినీ ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే అధికారులు ఓటరు తుది జాబితాను విడుదల చేశారు. ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేస్తున్నారు. దీంతో పంచాయతీల్లో ఎన్నికల సందడి మొదలైంది. MBNR-441, NGKL-463, GDWL-255, NRPT-290, WNPT-255 జిల్లాలో గ్రామపంచాయతీలు ఉన్నాయి.
News October 7, 2024
అమెరికాలో మంత్రి జూపల్లికి ఘన స్వాగతం
తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు ఆదివారం అమెరికాలో ఘన స్వాగతం లభించింది. దుబాయ్ నుంచి అమెరికాలోని వాషింగ్టన్ డిసీ నగరానికి చేరుకున్న మంత్రికి పలువురు ఎన్నారైలు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడుతూ.. తెలంగాణ పర్యాటక ప్రమోషన్, అభివృద్ధి, పెట్టుబడులే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్నట్టు తెలిపారు.
News October 6, 2024
అణగారిన ప్రజల మనిషి కామ్రేడ్ లక్ష్మీదేవమ్మ: కామ్రేడ్ తమ్మినేని
అణగారిన ప్రజల మనిషి కామ్రేడ్ లక్ష్మీదేవమ్మ అని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ తమ్మినేని వీరభద్రం అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఆమె సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. లక్ష్యసాధన కోసం చేయవలసిన కృషిని అనుక్షణం గుర్తు చేసే ఆదర్శ జీవితం కామ్రేడ్ లక్ష్మీదేవమ్మది కొనియాడారు. కామ్రేడ్ అరుణ్, జబ్బార్ ఉన్నారు.