News May 12, 2024
అలంపూర్ చౌరస్తా డాబాలో అల్లు అర్జున్

అలంపూర్ చౌరస్తా శివారులో జాతీయ రహదారిపై ఉన్న గురునానక్ ధాబాలో సిని హీరో అల్లు అర్జున్ భోజనం చేసి వెళ్లారు. శనివారం హైదరాబాద్ నుంచి నంద్యాల జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా నంద్యాలకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో డాబా దగ్గర భోజనం చేశారు. అభిమానులు ఫొటోల కోసం పోటీపడ్డారు. అయితే దాబా యజమాని తిరుపాల్ సింగ్ కుటుంబ సభ్యులకు మాత్రమే ఫొటో దిగేందుకు అనుమతి ఇచ్చారు.
Similar News
News January 19, 2026
MBNR: రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

భూత్పూర్ మండలం తాటికొండ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు <<18892567>>ప్రాణాలు<<>> కోల్పోయాడు. SI చంద్రశేఖర్ వివరాలు.. కోయిలకొండ మండలం కొతలబాద్‌కు చెందిన రవికుమార్(26) తన స్నేహితుడిని కలిసేందుకు బైక్‌పై వెళ్తుండగా అన్నాసాగర్‌కు చెందిన ఆకాశ్ బైక్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో రవికుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి ఏడాది క్రితమే వివాహం కాగా, బాబు ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
News January 18, 2026
జడ్చర్ల: సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు దురదృష్టకరం: లక్ష్మారెడ్డి

మాజీ మంత్రులు హరీశ్ రావు, KTRలపై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి లక్ష్మారెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్ష నేతలను మారీచుడు, సుబాహుడు అని సంబోధించడం, “నడుం విరగ్గొడతా” అని మాట్లాడటం నీచమని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలోనే ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీలు వచ్చాయని, ప్రపంచంలోనే అతిపెద్ద మోటార్లతో ప్రాజెక్టులు నిర్మించామని గుర్తుచేశారు. తాము ఎన్నడూ అభివృద్ధికి అడ్డుపడలేదని స్పష్టం చేశారు.
News January 18, 2026
MBNR: రేపే ఆఖరి తేదీ దరఖాస్తు చేసుకోండి

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా గ్రామీణ యువత స్వయం ఉపాధి కోసం SBI RSETY ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ అందిస్తోంది. రేపటి (19)వరకు సీసీటీవీ కెమెరా శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఉచిత భోజనం, వసతి కల్పించనున్నారు. 19 నుంచి 45 సం. వయస్సు గల పురుషులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. బండమీదిపల్లిలోని RSETY కేంద్రంలో లేదా 9963369361, 9542430607 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు.


