News August 12, 2024

అలంపూర్: తుంగభద్ర నదిలో స్నానాలు బంద్: EO

image

జోగులాంబ ఆలయానికి దర్శనార్థం వచ్చే భక్తులు ఎవరూ తుంగభద్ర నదిలో స్నానాలకు దిగొద్దని ఈవో పురేందర్ కుమార్ సూచించారు. తుంగభద్ర నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో సోమవారం అలంపూర్ వద్ద పుష్కర ఘాట్‌ను ఈవో పరిశీలించారు. వారు మాట్లాడుతూ.. భక్తులు ఆలయం దగ్గరలోనే స్నానపు గదులు ఉన్నాయని, అక్కడే స్నానాలు ఆచరించాలన్నారు. ఆలయ సిబ్బంది పుష్కర్ ఘాట్ దగ్గర భక్తుల కదలికలను గమనించాలన్నారు.

Similar News

News October 1, 2024

ఉమ్మడి జిల్లా నేటి ఉష్ణోగ్రత వివరాలు

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మంగళవారం నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా.. అత్యధికంగా వనపర్తి జిల్లా రేమద్దులలో 37.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. గద్వాల జిల్లా ఐజలో 35.7 డిగ్రీలు, మహబూబ్నగర్ జిల్లా దోనూరులో 35.6 డిగ్రీలు, నాగర్ కర్నూల్ జిల్లా పెద్దూరులో 34.8 డిగ్రీలు, నారాయణపేట జిల్లా మంగనూరులో 34.1 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలో నమోదయ్యాయి.

News October 1, 2024

MBNR: ఉమ్మడి జిల్లాలో తగ్గుతున్న అమ్మాయిలు !

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో గత 3ఏళ్లుగా జననాల రేటులో అబ్బాయిల కంటే అమ్మాయిల సంఖ్య రోజురోజుకు తగ్గుతుంది. గత ఏడాదిలో బాలురు 28,891 జననాలు నమోదు కాగా.. అమ్మాయిలు 25,822 మంది మాత్రమే ఉన్నారు. పలు స్కానింగ్ కేంద్రాల్లో బేబీ జెండర్ గురించి చెప్తున్నట్లు సమాచారం. ఇలాగైతే బాలికల శాతం తగ్గనుంది. బాలికల కోసం సంక్షేమ పథకాలను అవగాహన కల్పిస్తూ.. స్కానింగ్ కేంద్రాలు తనిఖీలు చేస్తున్నామని DMHO పద్మా తెలిపారు.

News October 1, 2024

శ్రీశైలంలో 880.4 అడుగుల నీటిమట్టం

image

శ్రీశైలం జలాశయంలో సోమవారం నీటిమట్టం 880.4 అడుగుల వద్ద 190.3330 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఎగువ ఉన్న జూరాల, సుంకేసుల ద్వారా మొత్తం 81,607 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉంది.ఎడమగట్టు భూగర్భ కేంద్రంలో 16.335 M.U విద్యుదుత్పత్తి చేస్తూ 36,163 క్యూసెక్కులు, ఏపీ జెన్కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో 5.356 M.U ఉత్పత్తి చేస్తూ 22,197 మొత్తం 58,360 క్యూసెక్కుల నీటిని దిగువున సాగర్ కు విడుదల చేస్తున్నారు.