News April 1, 2025
అలంపూర్: ‘నిర్లక్ష్యానికి నిదర్శనం ప్రభుత్వ వైద్యశాల’

అలంపూర్ పట్టణ పరిధిలోని ప్రభుత్వ వైద్యశాలలో కనీస రోగులకు అందించే మందులు లేక రోగులు ఇబ్బంది పడుతున్నామని వాపోతున్నారు. అలంపూర్ పరిధిలోని సంతోష్ నగర్ కాలనీకి చెందిన పలువురు కుక్క కాటుకు గురయ్యారు. ఈ క్రమంలో వైద్యశాలకు వెళితే కుక్కకాటుకు మందు వైద్యశాలలో లేదని పక్క రాష్ట్రమైన కర్నూల్‌కి వెళ్లాలని వైద్యులు సూచించారని రోగులు ఆరోపిస్తున్నారు. కనీసం మందులు లేకుంటే ఎట్లా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు?
Similar News
News October 25, 2025
బస్సు యాక్సిడెంట్: హైదరాబాద్ కలెక్టరేట్లో హెల్ప్‌లైన్

కర్నూలు(D) చిన్నటేకూరు వద్ద నిన్న తెల్లవారుజామున వేమూరి కావేరి ట్రావెల్స్ స్లీపర్ బస్సులో జరిగిన అగ్నిప్రమాద ఘటన విదితమే. ఇందులో మృతి చెందిన, చిక్కుకున్న ప్రయాణికుల కుటుంబాలకు సహాయం అందించేందుకు HYD కలెక్టరేట్లో హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
నర్సయ్య, సూపరింటెండెంట్–వాట్సాప్ నం: 9063423950
సంగీత, కంట్రోల్ రూమ్: నం: 9063423979కు ఫోన్ చేయాలన్నారు.
News October 25, 2025
అర్ధరాత్రి లోపు అప్డేట్ చేయకపోతే జీతాలు రావు: ఆర్థిక శాఖ

TG: అక్టోబర్ నెల వేతనాలను ఆధార్‌తో లింక్ అయి ఉన్న <<18038300>>ఉద్యోగులకే<<>> ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి అన్ని శాఖల ఉన్నతాధికారులకు సర్క్యులర్ పంపారు. ఇవాళ అర్ధరాత్రి IFMIS పోర్టల్‌లో ఆధార్ లింక్ చేయాలని డెడ్‌లైన్ విధించింది. ఆధార్‌తో లింక్ కాని ఉద్యోగులకు జీతాలు జమ కావని స్పష్టంచేశారు.
News October 25, 2025
మరో రెండు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

AP: తుఫాన్ నేపథ్యంలో అధికారులు మరో రెండు జిల్లాలకు సెలవు ఇచ్చారు. ఇప్పటికే తూ.గో, అన్నమయ్య, కృష్ణా జిల్లాల్లోని విద్యాసంస్థలకు <<18103274>>హాలిడేస్<<>> ప్రకటించగా తాజాగా బాపట్ల, కడప జిల్లాల్లోనూ సెలవు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బాపట్లలో ఈనెల 27,28,29న, కడపలో 27,28న ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలతో పాటు అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించారు.


