News April 1, 2025
అలంపూర్: ‘నిర్లక్ష్యానికి నిదర్శనం ప్రభుత్వ వైద్యశాల’

అలంపూర్ పట్టణ పరిధిలోని ప్రభుత్వ వైద్యశాలలో కనీస రోగులకు అందించే మందులు లేక రోగులు ఇబ్బంది పడుతున్నామని వాపోతున్నారు. అలంపూర్ పరిధిలోని సంతోష్ నగర్ కాలనీకి చెందిన పలువురు కుక్క కాటుకు గురయ్యారు. ఈ క్రమంలో వైద్యశాలకు వెళితే కుక్కకాటుకు మందు వైద్యశాలలో లేదని పక్క రాష్ట్రమైన కర్నూల్‌కి వెళ్లాలని వైద్యులు సూచించారని రోగులు ఆరోపిస్తున్నారు. కనీసం మందులు లేకుంటే ఎట్లా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు?
Similar News
News April 20, 2025
కోటవురట్ల: ఆ కుటుంబంలో విషాదఛాయలు

కోటవురట్ల మండలం కైలాసపట్నం బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళలు వారి భర్తలను కోల్పోయారు. ఈ ప్రమాదంలో చౌడువాడ గ్రామానికి చెందిన సేనాపతి బాబురావుతో పాటు ఆయన అల్లుళ్లు అప్పికొండ తాతబాబు, మడగల జానకిరామ్ మృతి చెందారు. ఘటనా స్థలిలోనే బాబురావు, తాతబాబు మృతి చెందగా జానకిరామ్ శనివారం మృతి చెందాడు. దీంతో కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు నెలకొన్నాయి.
News April 20, 2025
అగ్నివీర్ ఎయిర్‌ఫోర్స్ నోటిఫికేషన్ విడుదల

అగ్నివీర్ ఎయిర్‌ఫోర్స్(మ్యూజిషియన్స్) పోస్టులకు <
వెబ్‌సైట్:https://agnipathvayu.cdac.in/
News April 20, 2025
రేపు వరంగల్ మార్కెట్ పునః ప్రారంభం

3 రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం పున: ప్రారంభం కానుంది. శుక్రవారం గుడ్ ఫ్రైడే, నిన్న, ఈరోజు వారాంతపు సెలవులు కావడంతో మార్కెట్ బంద్ ఉంది. దీంతో సోమవారం ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరుకులను మార్కెటుకు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు. కాగా ఉదయం 6 గంటల నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.