News June 2, 2024
అలంపూర్: హైవే- 44పై రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి గాయాలు
జాతీయ రహదారి-44పై అలంపూర్ చౌరస్తా సమీపంలో కంటైనర్ లారీ అదుపుతప్పి బోల్తా పడింది. హైదరాబాద్ నుంచి కర్నూలు వైపు వెళ్లే దారిలో గురు నానక్ డాబా ఈ ఘటన జరిగింది. డ్రైవర్ రాం బహదూర్, మరొకరికి స్వల్ప గాయాలు అయ్యాయి. గురుగావ్ నుంచి కర్ణాటకలోని కోచ్ కోడ్ కు కొరియర్ సరుకులతో కంటైనర్ వెళ్తున్నట్లు సమాచారం. కంటైనర్ రోడ్డుపై పూర్తిగా అడ్డంగా పడడంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జాంమైంది.
Similar News
News September 17, 2024
NRPT: 250 మంది పోలీసులతో బందోబస్తు
నారాయణపేట జిల్లా కేంద్రంలో నేటి అర్ధరాత్రి నుంచి ప్రారంభమయ్యే గణేశ్ శోభాయాత్రకు 250 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ యోగేష్ గౌతమ్ తెలిపారు. గణేశ్ మార్గ్‌లో సీసీ కెమెరాల ద్వారా కంట్రోల్ రూమ్ నుంచి సమీక్ష చేస్తామని చెప్పారు. జిల్లా కేంద్రంలోని వచ్చే వాహనాలను ఇతర మార్గాల ద్వారా డైవర్ట్ చేశామని అన్నారు. ప్రధాన కూడళ్లలో పోలీస్ పీకేటింగ్ ఏర్పాటు చేశామన్నారు.
News September 16, 2024
వట్టెం నవోదయలో ప్రవేశాలకు గడువు పెంపు
బిజీనేపల్లి మండలం వట్టెంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో 2025-26 విద్యా సంవత్సరంలో 6వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు గడువును ఈనెల 23 వరకు పొడిగించినట్లు ప్రిన్సిపల్ శ్రీ పి.భాస్కర్ కుమార్ తెలిపారు. ఐదో తరగతి చదువుతున్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు నవోదయ వెబ్‌సైట్‌లో చూడాలని చెప్పారు.
News September 16, 2024
శ్రీశైలం ప్రాజెక్టుకు వరద
శ్రీశైలం జలాశయంలో ఆదివారం రాత్రి 9 గంటలకు 883.30 అడుగులు, నీటి నిల్వ 206,0906 టీఎంసీలుగా నమోదైంది. ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల, సుంకేసుల జలాశయాల నుంచి 41,287 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి వస్తోంది. శ్రీశైలం కుడి, ఎడమగట్టు జలవిద్యుత్తు కేంద్రాల్లో విద్యుత్తు ఉత్పత్తి చేస్తూ 68,194 క్యూసెక్కుల వరద నీటిని నాగార్జునసాగర్ కు విడుదల చేస్తున్నారు.