News June 27, 2024
అలకవీడిన MLC జీవన్ రెడ్డి!
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరికతో కాంగ్రెస్ MLC జీవన్ రెడ్డి మనస్తాపానికి గురైన విషయం తెలిసిందే. దీంతో ఆయన్ను పార్టీ అధిష్ఠానం ఢిల్లీకి పిలిపించి సర్దిచెప్పింది. ఎమ్మెల్యేల చేరికలు పార్టీకి అవసరమని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్మున్షీ, కేసీ వేణుగోపాల్ నచ్చజెప్పడంతో అలకవీడారు. పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యమిస్తామన్న భరోసాతో ఆయన సంతృప్తి చెందినట్లు తెలుస్తోంది.
Similar News
News November 29, 2024
రేపు రైతు వేదికల్లో సీఎం సభ ప్రత్యక్ష ప్రసారం: కలెక్టర్
ఈనెల 30న రైతు పండుగ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఒక ప్రకటనలో తెలిపారు. రైతు పండుగ వేడుకల్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్నగర్ జిల్లా నుంచి రైతులను ఉద్దేశించి శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రసంగిస్తారని, ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ఉంటుందని పేర్కొన్నారు. జిల్లాలోని 15 రైతు వేదికల్లో ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం ఉంటుందన్నారు.
News November 29, 2024
REWIND: కరీంనగర్లో KCR అరెస్ట్.. NIMSలో దీక్ష విరమణ
ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం KCR చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసింది. 29 NOV 2009లో కరీంనగర్లోని తెలంగాణభవన్ నుంచి సిద్దిపేటలోని దీక్ష శిబిరానికి వెళుతుండగా అలుగునూర్ చౌరస్తా వద్ద KCRని అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి ఖమ్మం తరలించారు. జైలులో దీక్ష చేయగా ఆయన ఆరోగ్యం క్షీణించింది. వెంటనే NIMSకు తరలించారు. DEC 9న కేంద్రం నుంచి సానుకూల ప్రకటన రావడంతో KCR NIMSలో దీక్ష విరమించారు.
News November 29, 2024
జగిత్యాల: పోలీస్ సిబ్బందికి ప్రశంస ప్రోత్సాహకాలు
జగిత్యాల జిల్లాలోని పోలీస్ విధి నిర్వహణలో భాగంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులకు, సిబ్బందికి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అభినందించి ప్రశంస ప్రోత్సాహక పత్రాలను అందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు, వాహన తనిఖీలు నిర్వహించాలని సూచించారు. ప్రమాదాల నివారణలో భాగంగా ద్విచక్ర వాహన దారులు హెల్మెట్ తప్పని సరిగా ధరించేలా పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.