News September 14, 2024

అలజడి సృష్టించే వారిని ఉక్కుపాదంతో అణిచి వేయండి: మంత్రి పొన్నం

image

ఐక్యతకు హైదరాబాద్‌ ప్రతీకగా నిలుస్తోందని, ఎక్కడైనా అలజడులు సృష్టిస్తే కఠినంగా వ్యవహరించాలని అధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆదేశించారు. వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా వర్గవిభేదాలు సృష్టిస్తూ సోషల్‌ మీడియా ద్వారా రెచ్చగొట్టే, అపోహలు సృష్టించే వారిని ఉక్కుపాదంతో అణిచి వేయాలన్నారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, కలెక్టర్‌, సీపీతో కలిసి మాట్లాడారు.

Similar News

News January 5, 2026

మెదక్: 1978-94 వరకు చదివిన విద్యార్థులు ఒకే చోట

image

మెదక్ పట్టణంలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో 1978 నుంచి 1994 వరకు విద్యాభ్యాసం చేసిన 10వ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థినుల సమ్మేళనం ఆదివారం పాఠశాలలో ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో 350 మంది పూర్వ విద్యార్థినులు పాల్గొన్నారు. సఖీ సంఘ్ పేరిట నిర్వహించిన పూర్వ విద్యార్థినుల సమ్మేళానాన్ని డి.మధుర స్మిత్, డాక్టర్ చల్లా గీత, సీహెచ్.శ్రీదేవీ, రిటైర్డ్ హెడ్ మాస్టర్ పొద్దార్ రేఖ పర్యవేక్షించారు.

News January 5, 2026

మెదక్: నేటి నుంచి మండల కేంద్రాల్లో ప్రజావాణి: కలెక్టర్

image

మెదక్ జిల్లా కేంద్రంతో పాటు మండల తహశీల్, ఎంపీడీవో, ఆర్డీవో కార్యాలయాల్లో కూడా సోమవారం నుంచి ప్రజావాణి నిర్వహించేందుకు కలెక్టర్ రాహుల్ రాజ్ వినూత్న ఆలోచన చేశారు. ఈ సోమవారం కలెక్టర్ స్వయంగా రేగోడ్ మండల కేంద్రంలో నిర్వహించే ప్రజావాణిలో హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. జిల్లా కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం ప్రజావాణిలో కలెక్టర్‌తో పాటు జిల్లా అధికారులు పాల్గొంటున్న విషయం తెలిసిందే.