News January 27, 2025
అలాంటి వారి సమాచారం ఇవ్వండి: ఏసీపీ

విజయవాడ నగరాన్ని గంజాయి రహిత నగరంగా మార్చేందుకు ప్రజలు సహకరించాలని ఏసీపీ దామోదర్ పిలుపునిచ్చారు. ఎవరైనా తమ పరిసర ప్రాంతాల్లో గంజాయి తీసుకున్నా, విక్రయించినా పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. నేరాలు నియంత్రణలో ప్రజలు భాగస్వాములైనప్పుడే నేరాలను అరికట్టవచ్చని సూచించారు. బ్లేడు గంజాయి బ్యాచ్పై ఉక్కు పాదం మోపుతున్నామని, వారిపై నిరంతరం నిఘా కొనసాగిస్తామని ఏసీపీ తెలిపారు.
Similar News
News December 9, 2025
తేగలు తింటే ఎన్ని లాభాలో..!

శీతాకాలంలో తాటి తేగలు (గేగులు) ఎక్కువగా లభిస్తుంటాయి. వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. అలాగే తేగల్లో ఖనిజాలు, విటమిన్లు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా రక్తహీనత నివారణ, శరీర బరువును నియంత్రించడంలో ఇవి సహాయపడతాయి. షుగర్ వ్యాధిగ్రస్థులూ తినొచ్చు. తాటి గింజలు మొలకెత్తినప్పుడు నేలలో నుంచి తవ్వి తీసిన మొలకలే ఈ తేగలు. మీరెప్పుడైనా టేస్ట్ చేశారా? comment
News December 9, 2025
మెదక్: కోడ్ ఎఫెక్ట్.. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కలెక్టర్ దూరం

రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాలు ఈరోజు ఆవిష్కరించారు. ముందుగా కలెక్టర్ల చేతుల మీదుగా విగ్రహాలు ఆవిష్కరణ జరుగుతుందని అధికార యంత్రాంగం తెలిపింది. కానీ పంచాయతీ ఎన్నికల సందర్భంగా కోడ్ అమల్లో ఉన్నందున మెదక్లో కలెక్టర్, అదనపు కలెక్టర్, ఎస్పీలు దూరంగా ఉన్నారు. దీంతో డీఆర్ఓ చేతుల మీదుగా ఆవిష్కరణ చేసి కార్యక్రమం ముగించారు.
News December 9, 2025
జడ్చర్ల: పంచాయతీ ఏర్పడిన ఐదేళ్లకు ఎన్నికలు

జడ్చర్ల మండలం బండమీదిపల్లి గ్రామం ప్రత్యేక గ్రామపంచాయతీగా ఏర్పడిన తర్వాత 2020 డిసెంబర్ 20 నుంచి ప్రత్యేక అధికారి పాలనలో నడుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తుండడంతో గ్రామంలో మూడో విడత ఎన్నికల నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. సమస్యలు తీరి గ్రామ సర్పంచ్ పాలనలో గ్రామ అభివృద్ధి చెందిందని గ్రామస్థులు ఆశాభావం వ్యక్తం చేశారు.


