News August 20, 2024
అలా చేసి ఉంటే చిన్నారులు బతికే వాళ్లు..!

పుడ్ పాయిజన్ ఘటనలో ముగ్గురు చిన్నారులు చనిపోయిన విషయం తెలిసిందే. శనివారం రాత్రే ఆశ్రమంలోని పిల్లలకు వాంతులు, విరేచనాలు అయ్యాయి. ఆదివారం తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి ఇంటికి పంపేయగా అక్కడ చనిపోయారు. ఆశ్రమానికి దగ్గరలో 50 పడకల ఆసుపత్రి ఉంది. వారిని శనివారం రాత్రే అక్కడికి తీసుకెళ్లి ఉంటే బతికే వాళ్లని, సకాలంలో వైద్యం అందకపోవడంతోనే చనిపోయారని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.
Similar News
News January 9, 2026
ఏపీ ఆంధ్ర బాలికల క్రికెట్ జట్టుకు ప్రత్యేక శిక్షణ

పీఎంపాలెం క్రికెట్ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ అంధ బాలికల క్రికెట్ జట్టు ప్రత్యేక శిక్షణ పొందుతోంది. ఈనెల 16 నుంచి 22వ తేదీ వరకు ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్లో జాతీయస్థాయి ఉమెన్స్ బ్లైండ్ క్రికెట్ పోటీలు జరగనున్నాయి. వీటికి ఏపీ నుంచి ఈ టీంమ్ పాల్గొంటుందని విభిన్న ప్రతిభవంతుల సహాయ సంచాలకులు సవిత తెలిపారు. క్రీడాకారిణులకు కావలసిన అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని ఆమె చెప్పారు.

News January 8, 2026
విశాఖ స్టీల్ ప్లాంట్లో కార్మికుడి మృతి

విశాఖ స్టీల్ ప్లాంట్లో ఓ కార్మికుడు మృతి చెందాడు. అజీమాబాద్కు చెందిన మహమ్మద్ సుబాన్ (41) ప్లాంట్లోని ఫ్రెండ్స్ ఎంటర్ప్రైజెస్ కంపెనీలో పనిచేస్తున్నాడు. గురువారం సెంటర్ ప్లాంట్ విభాగంలో పనులు ముగించుకుని కిందకు దిగుతుండగా ప్రమాదవశాత్తు జారి పడ్డాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. దీనిపై స్టీల్ ప్లాంట్ పోలీసులు కేసు నమోదు చేశారు.