News February 25, 2025
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీలపై కేసులు: విశాఖ జేసీ

గ్యాస్ సిలిండర్ డెలివరీ బాయ్‌లు MRP కంటే ఎక్కువ డబ్బులు వసూలు చేస్తే లీగల్ మెట్రాలజీ చట్టం ప్రకారం గ్యాస్ ఏజెన్సీలపై కేసులు నమోదు చేస్తామని విశాఖ జేసీ మయూర్ అశోక్ హెచ్చరించారు. గ్యాస్ ఏజెన్సీల డిస్ట్రిబ్యూటర్లతో సోమవారం ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. దీపం-2 పథకం కింద సిలిండర్ డెలివరీ చేసిన 48 గంటల్లోపు లబ్దిదారుల ఖాతాలో సబ్సిడీ జమ కావాలన్నారు. కాని పక్షంలో డీలర్లను సంప్రదించారని లబ్ధిదారులను కోరారు.
Similar News
News February 25, 2025
భక్తులపై ఏనుగులు దాడి.. హోంమంత్రి అనిత ఘటనపై ఆరా

భక్తులపై ఏనుగుల దాడి చేసిన ఘటనపై హోంమంత్రి అనిత ద్రిగ్భాంతి వ్యక్తం చేశారు. అన్నమయ్య జిల్లాలోని వైకోట సమీపంలో గుడాలకోన వద్ద జరిగిన ఈ ఘటనపై ఎస్పీ విద్యాసాగర్‌తో హోంమంత్రి మాట్లాడారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని ఏనుగుల దాడిలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని గుండాల కోనకు వెళ్లే భక్తులకు మరింత భద్రత ఏర్పాటు చేయాలని సూచించారు.
News February 25, 2025
వెంకోజిపాలెంలో దారుణ హత్య

విశాఖ నగరంలోని రామ్ నగర్ ప్రాంతానికి చెందిన ఆనంద్ అనే వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు చంపేశారు. ఏపీ పోలీస్ స్టేషన్ పరిధిలో వెంకోజి పాలెం వద్ద ఈ సంఘటన చోటుచేసుకుంది. రాత్రి 12 గంటల తర్వాత ఘటన జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి పోలీసులు, క్లూస్ టీం చేరుకున్నారు. ఏసీపీ అన్నెపు నర్సింహామూర్తి, సీఐ మురళి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News February 25, 2025
మార్చి 29తో ముగియనున్న ఎమ్మెల్సీ పదవీ కాలం

టీడీపీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు పదవీకాలం మార్చి 29తో ముగియనుంది. టీడీపీలో అంచెలంచెలుగా ఎదిగిన రామారావు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. 2019లో ఎమ్మెల్యే కోటాలో దువ్వారపు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఈ స్థానం ఖాళీ కానుంది. అయితే ఇప్పటికే రాష్ట్రంలోని 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ జారీ చేసింది. ఈయన స్థానంలో పార్టీ ఎవరి పేరును ఖరారు చేస్తుందో వేచి చూడాలి.