News July 22, 2024
అలా జరిగితే.. కూటమిదే విశాఖ మేయర్ పీఠం..!

విశాఖలో 12 మంది కార్పొరేటర్లు కూటమికి మద్దతివ్వడంతో YCP బలం 50కి చేరింది. TDPలో గెలిచి YCPలో చేరిన కోటేశ్వరరావు, కాకి గోవిందరెడ్డి TDPలో చేరే అవకాశాలున్నాయి. అలా జరిగితే YCPకి 48, కూటమి బలం 47గా మారనుంది. మరో ఐదుగురిని కూటమిలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. దీంతో స్థాయీ సంఘం ఎన్నికల్లో గెలిచి.. ఆపై మేయర్ పీఠం కైవసం చేసుకునే దిశగా కూటమి నేతలు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.
Similar News
News January 2, 2026
న్యూఇయర్ రోజు విశాఖలో యువకుడి ఆత్మహత్య

న్యూఇయర్ వేళ విశాఖలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీనివాస్ నగర్‌కి చెందిన షణ్ముఖరావు (33) తన పిన్ని వద్ద ఉంటూ గోపాలపట్నంలో పనిచేస్తున్నాడు. ఇటీవల తన మిత్రులు జానీ, గోపాల్‌తో కలిసి బయటకు వెళ్లాడు. అక్కడ గొడవ జరగడంతో జానీని కొట్టాగా.. అతడు పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో భయపడిన షణ్ముఖరావు మామిడి తోటలో గురువారం ఉరివేసుకున్నట్లు గోపాలపట్నం పోలీసులు ప్రాథమిక అంచనా వేశారు.
News January 2, 2026
సామాజిక న్యాయం సాధనకై ఉద్యమిద్దాం: సత్యారెడ్డి

సామాజిక న్యాయం అంశాన్ని పాఠ్యాంశంగా చేర్చాలని ప్రముఖ సినీ దర్శకుడు, నటుడు సత్యారెడ్డి ఆకాంక్షించారు. సిఐటియు జాతీయ మహాసభ సందర్భంగా జరుగుతున్న శ్రామిక ఉత్సవ్ 6వ రోజు సామాజిక న్యాయం సాధనకై ఉద్యమిద్దాం థీమ్‌తో నిర్వహించిన సభా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ యత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకునితీరాలని చెప్పారు.