News February 14, 2025
అలిపిరి నడక మార్గంలో చిరుత కదలికలు

తిరుమలకు వెళ్లే అలిపిరి నడకమార్గంలో చిరుత సంచారం కలకలం రేపింది. 7వ మలుపు వద్ద నడకదారి భక్తులకు చిరుత కనిపించడంతో భయంతో పరుగులు తీశారు. భక్తుల నుంచి సమాచారం అందుకున్న విజిలెన్స్ అటవీశాఖ అధికారులు చిరుత ఆనవాళ్లను గుర్తించే పనిలో ఉన్నారు. చిరుత కదలికల పట్ల భక్తులను టీటీడీ అప్రమత్తం చేసింది. దీంతో భద్రత నడుమ భక్తులను గుంపులు గుంపులుగా పంపుతున్నారు.
Similar News
News March 15, 2025
చిత్తూరు: వైసీపీ అనుబంధ విభాగాల నియామకం

చిత్తూరు జిల్లాకు చెందిన పలువురికి వైసీపీ రాష్ట్ర అనుబంధ విభాగాలలో చోటు కల్పిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మైనార్టీ విభాగం స్టేట్ జోనల్ అధ్యక్షునిగా షఫీ అహ్మద్ ఖాద్రి, కార్యదర్శులుగా అబ్బాస్, మహీన్, జాయింట్ సెక్రటరీలుగా సర్దార్, నూర్, ఐటీ వింగ్ జనరల్ సెక్రటరీగా భాస్కర్ రెడ్డి, సెక్రటరీగా యుగంధర్ రెడ్డి నియమితులయ్యారు.
News March 15, 2025
చిత్తూరు జిల్లాలో నేటి నుంచి ఒంటిపూట బడులు

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా శనివారం నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వేసవిని దృష్టిలో ఉంచుకుని ఏప్రిల్ 23వ తేదీ వరకు ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకే బడులు నిర్వహించనున్నారు. పదో తరగతి పరీక్షలు జరుగుతున్న 118 పాఠశాలల్లో మాత్రం మధ్యాహ్నం 1.15 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పాఠశాలలు పనిచేయాలని ఉత్తర్వుల్లో సూచించారు.
News March 15, 2025
చిత్తూరు ఇన్‌ఛార్జ్ కలెక్టర్‌గా విద్యాధరి

చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ నేటి(శనివారం) నుంచి ఈ నెల 19వరకు సెలవులోకి వెళ్లినట్లు అధికారులు తెలిపారు. వ్యక్తిగత పనుల నిమిత్తం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇన్‌ఛార్జ్ కలెక్టర్‌గా జాయింట్ కలెక్టర్ విద్యాధరి వ్యవహరించనున్నారు.