News March 20, 2024
‘అలిపిరి మెట్ల మార్గంలో ఎలుగుబంటి సంచారం’

తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తున్న భక్తులకు టీటీడీ కీలక సూచన చేసింది. అలిపిరి మెట్ల మార్గంలో ఎలుగుబంటి సంచరిస్తున్నదని తెలిపారు. ఇప్పటికే ట్రాప్ కెమెరాల ద్వారా ఎలుగుబంటి తిరుగుతున్నట్లుగా గుర్తించారు. దీంతో భక్తులకు రక్షణ కల్పించేందుకు టీడీపీ తక్షణ చర్యలు చేపట్టింది. ఎలుగుబంటి సంచరిస్తున్న ప్రాంతంలో గస్తీని పెంచింది. ఒంటరిగా మెట్లదారిలో రావొద్దని, గ్రూపులుగా మాత్రమే రావాలని సూచించింది.
Similar News
News April 3, 2025
చిత్తూరు: నేటి నుంచి ప్రత్యేక ఆధార్ క్యాంపులు

చిత్తూరు జిల్లావ్యాప్తంగా ఈనెల 3వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ఆధార్ స్పెషల్ క్యాంపులను నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆరేళ్ల లోపు పిల్లలకు, ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూపులకు ఆధార్ నమోదు ప్రక్రియ చేపట్టనున్నట్లు చెప్పారు. ఎంపిక చేసిన గ్రామ, వార్డు సచివాలయాల్లో స్పెషల్ క్యాంపులు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. ఈనెల 8వ తేదీ నుంచి 11వ తేదీ వరకు మరో విడత క్యాంపులు నిర్వహించనున్నారు.
News April 3, 2025
చిత్తూరు: నేటి నుంచి స్పాట్ వాల్యుయేషన్

చిత్తూరు జిల్లా కేంద్రంలోని పీసీఆర్ ప్రభుత్వ పాఠశాలలో గురువారం నుంచి టెన్త్ మూల్యాంకనం జరగనున్నట్లు డీఈవో వరలక్ష్మి తెలిపారు. 10వ తేదీ వరకు స్పాట్ వాల్యుయేషన్ కొనసాగుతుంది. 1,244 మంది టీచర్లకు ఈ బాధ్యత అప్పగించారు. ప్రతి టీచర్ తప్పనిసరిగా మూల్యాంకన విధులకు హాజరు కావాలన్నారు. పేపర్లు కరెక్షన్ చేసే సమయంలో సెల్ఫోన్ వాడరాదని స్పష్టం చేశారు.
News April 3, 2025
తిరుపతి మార్గంలో తప్పిన పెనుప్రమాదం

భాకరాపేట ఘాట్ రోడ్డులో బుధవారం మధ్యాహ్నం పెను ప్రమాదం తప్పింది. కొంత మంది ప్రయాణికులతో మదనపల్లె నుంచి ఆర్టీసీ బస్సు తిరుపతికి బయల్దేరింది. ఘాట్ రోడ్డులోకి రాగానే బస్ బ్రేక్లు ఫెయిలయ్యాయి. గమనించిన డ్రైవర్ ప్రయాణికులను అలర్ట్ చేశారు. ఆ తర్వాత చాకచక్యంగా రోడ్డు పక్కన ఉన్న కొండను ఢీకొట్టారు. కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రాణనష్టం తప్పింది.