News September 9, 2024
అలీ సాగర్ గేట్లను ఏ క్షణమైనా ఎత్తవచ్చు: ఏఈ రాజ్యలక్ష్మి

ఎడపల్లి మండలంలోని అలీ సాగర్ ప్రాజెక్టు వరద గేట్లను ఏ క్షణమైన ఎత్తే అవకాశాలు ఉన్నాయని ఇరిగేషన్ ఏఈ రాజ్యలక్ష్మి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాజెక్టు ఎగువ పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు ఉన్నందున ప్రాజెక్టు గేట్లు ఎత్తే అవకాశం ఉందన్నారు. దిగువ ప్రాంత ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా ఆమె సూచించారు. ఈ విషయమై గ్రామాల్లో దండోరా వేయించాలని ఏఈ రాజ్యలక్ష్మి తెలిపారు.
Similar News
News November 13, 2025
భీమ్గల్: రూ.4 కోట్లతో టూరిజం గెస్ట్ హౌస్ నిర్మాణం

టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చొరవతో భీమ్గల్ మండలం లింబాద్రి గుట్టలోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం అభివృద్ధి దిశగా మరో అడుగు పడింది. ఆలయ ప్రాంగణంలో రూ.4 కోట్ల వ్యయంతో టూరిజం గెస్ట్ హౌస్ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయానికి సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకి మహేష్ కుమార్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.
News November 13, 2025
నిజామాబాద్: ఆకతాయిలను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న షీ టీమ్స్

నిజామాబాద్ పట్టణంలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజి కోటగల్లీ వద్ద బాలికలను ఫాలో చేస్తూ, అసభ్యంగా ప్రవర్తించిన నలుగురు ఆకతాయిలను షీ టీమ్స్ బృందం బుధవారం రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. నిందితులను తదుపరి చర్యల కోసం 2ఃవ టౌన్ పోలీస్ స్టేషన్కు అప్పగించారు. మహిళలను వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని షీ టీమ్స్ సిబ్బంది హెచ్చరించారు.
News November 13, 2025
NZB: నియోజకవర్గాల వారీగా జాగృతి అడ్ హక్ కమిటీల నియామకం

తెలంగాణ జాగృతి విస్తరణలో భాగంగా నియోజకవర్గాల వారీగా జాగృతి అడ్ హక్ కమిటీలను కవిత ప్రకటించారు. ఈ మేరకు అర్బన్ కమిటీ సభ్యులుగా కరిపే రాజు, యెండల ప్రసాద్, రెహన్ అహ్మద్, ఇరుమల శంకర్, పంచరెడ్డి మురళీ, అంబాటి శ్రీనివాస్ గౌడ్, సాయికృష్ణ నేత, షానావాజ్ ఖాన్, రూరల్ నరేష్ నాయక్, బాణోత్ ప్రేమ్ దాస్, ఆర్మూర్ నుంచి ఏలేటి నవీన్ రెడ్డి, మనోజ్ రావు, ఆజమ్, బాల్కొండకు మహేందర్ రెడ్డి, ధీరజ్లను నియమించారు.


