News November 12, 2024
అల్పపీడనంపై విపత్తు ఎండీతో హోం మంత్రి సమీక్ష

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ ఎండి రోణంకి కూర్మనాథ్‌తో రాష్ట్ర హోం&విపత్తుల శాఖ మంత్రి వంగలపూడి అనిత విజయవాడలో సమీక్షించారు. తీసుకోవలసిన జాగ్రత్తలపై తగిన సూచనలు సలహాలు ఇచ్చినట్లు ఆమె పేర్కొన్నారు. రాయలసీమ, దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురిసే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో రైతులు, ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించానన్నారు.
Similar News
News February 25, 2026
ఏపీ మెడిటెక్ జోన్‌లో ఇండో-జర్మన్ టెక్నాలజీ సెంటర్?

విశాఖలోని A.P మెడిటెక్ జోన్‌లో ఇండో-జర్మన్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ ప్రాంతీయ కేంద్రం ఏర్పాటు దిశగా చర్యలు ప్రారంభమయ్యాయి. జర్మన్ కాన్సుల్ జనరల్ ప్రతినిధి బృందం పర్యాటనలో ఈ ప్రతిపాదనపై చర్చలు జరిగాయి. మెడ్‌టెక్ రంగంలో సంయుక్త పరిశోధన, ఆధునిక సాంకేతిక అభివృద్ధికి ఇది కీలకం కానుంది. ఇదే రోజున రోబోటిక్స్ సంస్థ Cogmac Technologies మెడిటెక్ జోన్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
News February 25, 2026
రాజాంలో పద్మం సిల్వర్ జువెలరీ గ్రాండ్ ఓపెనింగ్

పద్మం సిల్వర్ జువెలరీ బ్రాంచ్‌ను రాజాంలోని పాలకొండ రోడ్డులో గల CMRలో ఏర్పాటు చేశారు. ఈ స్టోర్‌ను టీడీపీ నాయకుడు కొండ్రు జగదీశ్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా స్టోర్‌లో విభిన్న ఆభరణాలతో పాటు అద్భుతమైన ఆఫర్లను పెట్టారు. సిల్వర్ జువెలరీకి కూడా మార్కెంట్‌లో డిమాండ్ పెరిగిందని CMR గ్రూపుల అధినేత మావూరి వెంకట రమణ పేర్కొన్నారు.
News February 25, 2026
విశాఖలో పర్యటించనున్న ఒడిశా గవర్నర్

ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు ఫిబ్రవరి 26 నుంచి మార్చి 5 వరకు విశాఖలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన ఐఐఏఎమ్‌లో పుస్తకావిష్కరణ, ‘ప్రైడ్ ఆఫ్ నేషన్’ అవార్డుల ప్రదానం, బాలాజీ హైఫీల్డ్స్ స్కూల్ వార్షికోత్సవం, అమలాపురంలో జరిగే ‘వరల్డ్ తెలుగు కాన్‌క్లేవ్’ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మార్చి 5న తిరిగి భువనేశ్వర్ వెళ్తారు.


