News November 12, 2024
అల్పపీడనంపై విపత్తు ఎండీతో హోం మంత్రి సమీక్ష
నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ ఎండి రోణంకి కూర్మనాథ్‌తో రాష్ట్ర హోం&విపత్తుల శాఖ మంత్రి వంగలపూడి అనిత విజయవాడలో సమీక్షించారు. తీసుకోవలసిన జాగ్రత్తలపై తగిన సూచనలు సలహాలు ఇచ్చినట్లు ఆమె పేర్కొన్నారు. రాయలసీమ, దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురిసే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో రైతులు, ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించానన్నారు.
Similar News
News December 6, 2024
విశాఖ: డ్రగ్స్ కాదు.. డ్రై ఈస్ట్
ఈ ఏడాది మార్చిలో ఎన్నికల వేళ విశాఖ పోర్టుకి బ్రెజిల్ నుంచి 25 వేల టన్నుల డ్రగ్స్ వచ్చిందన్న వార్త సంచలనమైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై రంగంలోకి దిగిన సీబీఐ తాజాగా విచారణను ముగించింది. బ్రెజిల్ నుంచి వచ్చిన కంటైనర్‌లో డ్రగ్స్ లేదని కేవలం డ్రై ఈస్ట్ ఉన్నట్లు కోర్టుకు నివేదిక సమర్పించింది. దీంతో సీజ్ చేసిన షిప్‌ను విడుదల చేసినట్లు కస్టమ్స్ ప్రిన్సిపల్ కమిషనర్ ఎన్.శ్రీధర్ తెలిపారు.
News December 6, 2024
విశాఖ: వేటలో మేమే మేటి.. మాకు లేరు ఎవ్వరూ సాటి!
ఆహార సంపాదనలో పెద్ద పులులు తమదైన శైలిలో వ్యవహరిస్తూ ఉంటాయి. వేటాడే సమయంలో అణకువను ప్రదర్శిస్తూ ఓపికతో వేచి చూసి ఒక్క ఉదుటున ఇతర జంతువులపై దాడి చేసి చంపి తింటాయి. ఈ క్రమంలో వాటి ఓపికకు, సహనానికి సలాం కొట్టాల్సిందే. విశాఖ జూ పార్కులో చెట్టుపై కట్టిన మాంసాన్ని ఒక్క ఉదుటున లాక్కుని తింటున్న టైగర్ విన్యాసాలు చూపరులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి.
News December 6, 2024
విశాఖ: ‘ప్రజల ఆరోగ్యంపైనే దేశ ఆర్థిక అభివృద్ధి ఆధారపడి ఉంటుంది’
ప్రజల ఆరోగ్యం పైనే దేశ ఆర్థిక అభివృద్ధి ఆధారపడి ఉంటుందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ అన్నారు. డీప్ కాంక్లీవ్ పై విశాఖలో జరుగుతున్న సదస్సులో ఆయన పాల్గొన్నారు. ప్రజల ఆరోగ్యమే ఐశ్వర్వమని, అందుకు అత్యంత ప్రాముఖ్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఆరోగ్య రంగంలో ముందుకు వెళ్లేందుకు ఈ సదస్సు దోహదపడుతుందన్నారు.