News July 19, 2024

అల్పపీడనం.. ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు

image

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రేపు ఉదయం పూరీ సమీపంలో తీరం దాటుతుందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కళింగపట్నం, విశాఖ, గంగవరం, కాకినాడ, భీమిలి పోర్టుల్లో మూడో నంబర్, మచిలీపట్నం, నిజాంపట్నంలో మొదటి నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది.

Similar News

News February 25, 2026

ముఖాన్ని మెరిపించే బ్యూటీ టిప్స్

image

* కలువ పూరేకలు, తేనె, పాలు కలిపి పేస్ట్ చేసి ముఖానికి రాసి అరగంట తర్వాత కడిగేసుకుంటే ముడతలు, మచ్చలూ తగ్గుతాయి. * గులాబీ రేకల ముద్దకు కాసిన్ని పాలు, చెంచా సెనగపిండి కలిపి ముఖానికి, మెడకు రాయండి. పావుగంట ఆరనిచ్చి కడిగితే ముఖం మెరిసిపోతుంది. * మల్లెలను పేస్టు చేసి, అందులో కొబ్బరినూనె కలపాలి. దీన్ని ముఖానికి రాసి పావుగంట సేపు మృదువుగా మర్దనా చేయాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే చాలు.

News February 25, 2026

పట్టణాల్లో ఇళ్లు లేని వారికి GOOD NEWS

image

PMAY- U 2.0 కింద కొత్తగా 2.88L ఇళ్లను కేంద్రం మంజూరు చేసింది. ఇందులో మహిళలకు 1.60L గృహాలు, సీనియర్ సిటిజన్లకు 22,581, SCలకు 35,525, STలకు 9,773, OBCలకు 82,190 ఇళ్లను కేటాయించనుంది. దీంతో ఈ స్కీమ్‌లో పట్టణాలకు మంజూరు చేసిన మొత్తం ఇళ్ల సంఖ్య 13.61Lకు చేరింది. తాజా నిర్ణయంతో AP, TG సహా 16 రాష్ట్రాలు లబ్ధి పొందనున్నాయి. కాగా ఈ పథకం కింద ప్రభుత్వం రూ.2.50 లక్షల వరకు ఆర్థిక సాయం చేయనుంది.

News February 25, 2026

నేడు వెలిగొండకు సీఎం చంద్రబాబు

image

AP: సీఎం చంద్రబాబు ఇవాళ మార్కాపురం జిల్లాలో పర్యటించనున్నారు. దోర్నాల(M) గంటవానిపల్లి వద్ద రూ.456 కోట్లతో చేపడుతున్న పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కాలువ పనులకు శంకుస్థాపన చేస్తారు. ప్రాజెక్టు పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం తర్లుపాడులో జరిగే బహిరంగసభలో ప్రసంగిస్తారు. మార్కాపురం జిల్లా ఏర్పాటు చేసిన తర్వాత సీఎం అక్కడ పర్యటించడం ఇదే తొలిసారి.