News November 13, 2024
అల్పపీడనం.. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో బాపట్ల, ప్రకాశం జిల్లాల వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. పిడుగులు పడే అవకాశం ఉందని ఇప్పటికే ప్రజల ఫోన్‌లకు మెసేజ్‌లు పంపిస్తోంది. ఉరుములు, మెరుపులతో వర్షం పడే సమయంలో చెట్లు, సెల్ టవర్స్, విద్యుత్ స్తంభాల సమీపంలో, పొలాలు, బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని సూచించింది.
Similar News
News November 15, 2024
ప్రకాశం ఎస్పీ స్ట్రాంగ్ వార్నింగ్
సోషల్ మీడియాలో అసభ్యకరమైన, అనైతిక, విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ దామోదర్ హెచ్చరించారు. ఒంగోలులోని పోలీస్ కార్యాలయంలో గురువారం రాత్రి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం, టెలిగ్రాం, యూట్యూబ్, ఎక్స్ (ట్విట్టర్), ఇతర సోషల్ మీడియాలో ఇతరులను కించపరిచేలా పోస్టులు పెట్టి ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దన్నారు.
News November 14, 2024
ప్రకాశం జిల్లాలో 12 మంది ఏఎస్ఐలు బదిలీ
ప్రకాశం జిల్లాలో 12 మంది ఏఎస్ఐలు బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ దామోదర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీలు తక్షణమే అమలులోకి వస్తాయని అన్నారు. సంబంధిత పోలీస్ స్టేషన్ ఎస్సైలు, సీఐలు బదిలీ అయినా ఏఎస్ఐలకు రిలీవింగ్ ఆర్డర్లను ఇవ్వాలని, బదిలీ అయినా పోలీస్ స్టేషన్ వివరాలను వారికి తెలపాలని ఎస్పీ అధికారులకు సూచించారు.
News November 14, 2024
ప్రకాశం జిల్లాలో పోసానిపై మరో ఫిర్యాదు
సినీ నటుడు, వైసీపీ మద్ధతుదారుడైన<<14606978>> పోసాని కృష్ణమురళిపై<<>> ప్రకాశం జిల్లాలో మరొకొందరు ఫిర్యాదు చేశారు. టీటీడీ ఛైర్మన్ BR నాయుడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ యర్రగొండపాలెం పోలీసులను టీడీపీ నేతలు ఆశ్రయించారు. అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కనిగిరిలో సైతం కొందరు నాయకులు పోసానిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.