News March 8, 2025

అల్లంతోట బాయి తండాలో బాలుడు ఆత్మహత్య

image

వెల్దండ మండలoలోని అల్లంతోటబావి తండాలో 8 ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాలిలా.. మాడుగుల మండలం చెనగాల గట్టు తండాకు చెందిన దేన్యాకు ముగ్గురు కుమారులు. దేన్యా చిన్నకుమారుడు ఋషి (8) అమ్మమ్మ ఊరైన ఆల్లంతోట బాయి తండాలో ఉంటున్నాడు. శనివారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఊరి వేసుకొని మృతి చెందాడు. దేన్యా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కురుమూర్తి తెలిపారు.

Similar News

News October 23, 2025

దీక్షలు విరమించిన PHC వైద్యులు

image

AP: వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌తో PHC వైద్యుల చర్చలు సఫలం అయ్యాయి. PG సీట్లలో 20% ఇన్‌ సర్వీస్‌ కోటా ఈ ఏడాదికి, 15% కోటా వచ్చే ఏడాది ఇవ్వడానికి అంగీకారం కుదిరింది. తదుపరి ఇన్‌ సర్వీస్‌ కోటా అప్పటి వేకెన్సీల ఆధారంగా నిర్ణయిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. నోషనల్‌ ఇంక్రిమెంట్లు, టైం బౌండ్‌ ప్రమోషన్లపై కూడా సానుకూల స్పందన రావడంతో దీక్షలు విరమిస్తున్నట్లు PHCల వైద్యులు ప్రకటించారు.

News October 23, 2025

జాలర్లను క్షేమంగా తీసుకొస్తాం: రామ్మోహన్ నాయుడు

image

AP: బంగ్లాదేశ్ జలాల్లోకి పొరపాటున ప్రవేశించి, అక్కడి నేవీ అధికారులకు చిక్కిన <<18075524>>జాలర్ల<<>>ను క్షేమంగా స్వస్థలాలకు తీసుకొస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ విషయంపై విదేశాంగ మంత్రి జైశంకర్‌తో మాట్లాడినట్లు చెప్పారు. బంగ్లాదేశ్ ఎంబసీతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు. మరోవైపు బాధిత మత్స్యకార కుటుంబాలను ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కలిసి ధైర్యం చెప్పారు.

News October 23, 2025

PM ఆవాస్ యోజన పథకాన్ని వినియోగించుకోవాలి: కలెక్టర్

image

PM ఆవాస్ యోజన గ్రామీణ్ పథకాన్ని అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. గురువారం పెద అమిరంలోని కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖ అధికారులతో ఆమె సమీక్షించారు. జిల్లాలోని 319 రెవెన్యూ గ్రామాల్లో ఈనెల 22 నుంచి సచివాలయ సిబ్బందితో సర్వే ప్రారంభించాలన్నారు. అర్హులుగా ఉండి, సొంత స్థలం కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు.