News September 8, 2024
అల్లకల్లోలంగా ఉప్పాడ బీచ్.. నేడు, రేపు జాగ్రత్త
ఉప్పాడ సముద్ర తీరంలో అలలు ఎగసి పడడంతో ఆ ప్రాంతమంతా కోతకు గురవుతోంది. బీచ్ రోడ్డుకు రక్షణగా వేసిన రాళ్ల గోడను సైతం దాటుకుని అలలు ఎగసి పడుతున్నాయి. శనివారం బీచ్ రోడ్డులో వెళ్లిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అలల కారణంగా తీర ప్రాంతంలో మత్స్యకారులు భయాందోళన చెందుతున్నారు. కాగా.. వాతావరణ శాఖ అధికారులు తీర ప్రాంత ప్రజలు ఆది, సోమవారాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Similar News
News October 13, 2024
తూ.గో జిల్లా వ్యాప్తంగా 253 గ్రామాలలో పంచాయతీ వారోత్సవాలు
తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఈనెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 253 గ్రామ పంచాయతీలలో పంచాయతీ వారోత్సవాలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. ఈ మేరకు రాజమహేంద్రవరంలోని కలెక్టరేట్ నుంచి ఆమె ఆదివారం మీడియాకు ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు జిల్లాలోని ఏడు నియోజకవర్గాలలో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఈ పంచాయతీ వారోత్సవాలు జరుగుతాయని ఆమె తెలిపారు.
News October 13, 2024
రంప: పర్యాటక ప్రాంతాలు మూసివేత
ఈ నెల 14 నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో ఏజెన్సీలో పర్యాటక ప్రాంతాలు ముసివేస్తున్నామని ITDA PO కట్టా సింహాచలం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కొండ వాగులు, కాలువలు, జలపాతాలు పొంగి ప్రవహించే అవకాశం ఉందని పేర్కొన్నారు. వర్షాల నేపథ్యంలో పర్యాటకులు ఏజెన్సీకి రావద్దని కోరారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి గిరిజన గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని కోరారు.
News October 13, 2024
అడ్డతీగల: వెల్లుల్లి ధర అదరహో
ఏజెన్సీ ప్రాంతం అయిన అడ్డతీగల పరిసర గ్రామాల్లో వెల్లుల్లి ధర గణనీయంగా పెరిగింది. నాణ్యమైనవి పెద్దవి 15రోజుల క్రితం కిలో రూ.300 పలుకగా నేడు రూ.400కి పెరిగింది. పంట తగ్గడంతో గిరాకీ పెరిగి రేటు పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. ఏజెన్సీ ప్రాంతానికి రాజమండ్రి నుంచి వీటిని వ్యాపారులు తీసుకొచ్చి విక్రయాలు జరుపుతారు. కూరగాయలు రేటు కూడా పెరగడం వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు.