News March 31, 2025
అల్లవరం: కారులో నుంచి దిగి వారధి పైనుంచి దూకిన వ్యక్తి

అల్లవరం మండలం బోడసకుర్రు మామిడికుదురు మండలం పాశర్లపూడి గ్రామాల మధ్యలోని వైనతేయ వారధిపై నుంచి దూకి ఆదివారం రాత్రి వ్యక్తి గల్లంతయ్యాడు. అమలాపురం నుంచి స్విఫ్ట్ డిజైర్ కార్లో వచ్చిన వ్యక్తి బ్రిడ్జిపై నుంచి దూకేసాడని స్థానికులు తెలిపారు. అల్లవరం పోలీస్ స్టేషన్ పరిధిలోకి ఈ ప్రాంతం వస్తుంది. దీనితో అల్లవరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 6, 2025
హోంగార్డుల సేవలు కీలకం: ఎస్పీ

63వ హోంగార్డ్స్ ఆవిర్భావ వేడుకలను శనివారం రాజమండ్రిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హోంగార్డులు నిస్వార్థ సేవలు అందిస్తూ, అత్యవసర పరిస్థితుల్లో సేవా దృక్పథంతో విధులు నిర్వహిస్తున్నారని ఎస్పీ కొనియాడారు. పోలీస్ శాఖలో హోంగార్డుల సేవలు కీలకమని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
News December 6, 2025
ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరలు.!

ప్రొద్దుటూరులో శనివారం బంగారం, వెండి ధరల వివరాలు:
☛ బంగారం 24 క్యారెట్ల 1 గ్రాము ధర: రూ.12,740
☛ బంగారం 22 క్యారెట్ల 1 గ్రాము ధర: రూ. 11,721
☛ వెండి 10 గ్రాములు ధర: రూ.1780.0=
News December 6, 2025
ఇండిగోపై కేంద్రం సీరియస్.. మీటింగ్కు రావాలని ఆదేశం

ప్రయాణికులను ఇబ్బంది పెట్టిన ఇండిగో యాజమాన్యంపై కేంద్ర విమానయాన శాఖ మరోసారి సీరియస్ అయింది. ఈరోజు సాయంత్రం 5 గంటలకు నిర్వహించే సమావేశానికి హాజరుకావాలని ఇండిగో యాజమాన్యాన్ని ఆదేశించింది. రద్దు చేసిన టికెట్ ఛార్జీలను రేపు సాయంత్రం 8 గంటల లోపు రిటర్న్ చేయాలని ఇప్పటికే సూచించింది.


