News March 31, 2025

అల్లవరం: కారులో నుంచి దిగి వారధి పైనుంచి దూకిన వ్యక్తి

image

అల్లవరం మండలం బోడసకుర్రు మామిడికుదురు మండలం పాశర్లపూడి గ్రామాల మధ్యలోని వైనతేయ వారధిపై నుంచి దూకి ఆదివారం రాత్రి వ్యక్తి గల్లంతయ్యాడు. అమలాపురం నుంచి స్విఫ్ట్ డిజైర్ కార్‌లో వచ్చిన వ్యక్తి బ్రిడ్జిపై నుంచి దూకేసాడని స్థానికులు తెలిపారు. అల్లవరం పోలీస్ స్టేషన్ పరిధిలోకి ఈ ప్రాంతం వస్తుంది. దీనితో అల్లవరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.  పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News July 6, 2025

టెస్టు చరిత్రలో తొలిసారి

image

ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఓ టెస్టులో తొలిసారిగా 1000+ రన్స్ నమోదు చేసింది. తొలి ఇన్నింగ్సులో 587 చేసిన గిల్ సేన రెండో ఇన్నింగ్సులో 427 పరుగులు చేసింది. ఇప్పటివరకు 2004లో ఆస్ట్రేలియాపై చేసిన 916 పరుగులే భారత జట్టుకు అత్యధికం. ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో రెండు ఇన్నింగ్సుల్లో గిల్ ద్విశతకం, శతకం బాదగా ఇతర ప్లేయర్లు ఒక్క సెంచరీ చేయకపోవడం గమనార్హం.

News July 6, 2025

కామారెడ్డి: పీర్లను సందర్శించిన షబ్బీర్ అలీ

image

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మొహరంలో భాగంగా శనివారం రాత్రి హైదరాబాద్ పాతబస్తీలో పీర్ల వద్దకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రభుత్వ సలహాదారు వెంట కాంగ్రెస్ నాయకులు, ముస్లిం మత పెద్దలు ఉన్నారు. ఆయన మాట్లాడుతూ.. మొహరం అన్ని వర్గాల వారు జరుపుకోవడం అభినందనీయమన్నారు.

News July 6, 2025

కరీంనగర్ డీఈఓకు ఎస్జీటీయూ వినతి

image

DEO శ్రీరామ్ మొండయ్యకు ఈరోజు SGTU జిల్లా శాఖ పక్షాన పలు విద్యా సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. త్వరలో జరగనున్న సర్దుబాటు ప్రక్రియలో SGT ఉపాధ్యాయులను PS, UPS లకే కేటాయించాలని, హై స్కూల్స్‌కు కేటాయించవద్దని కోరారు. మల్కాపూర్ PSలో తీవ్ర టీచర్ల కోరత ఉందన్నారు. ప్రతి పాఠశాలకు కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు ఉండేలా చూడాలని, బడిబాటలో విద్యార్థుల సంఖ్య పెరిగిన పాఠశాలలకు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.