News April 9, 2025
అల్లవరం: తీరంలో ఎగిసిపడుతున్న సముద్రపు అలలు

అల్పపీడనం కారణంగా అల్లవరం మండల పరిధిలోని సముద్ర తీర గ్రామాల్లో అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. రెండు రోజుల నుంచి అలల ప్రభావం తీవ్రంగా ఉందని స్థానిక మత్స్యకారులు మంగళవారం తెలిపారు. ఓడలరేవు, నక్కా రామేశ్వరం, కొమరగిరిపట్నం గ్రామాల్లో అలల తీవ్రత అధికంగా ఉంది. అలల ప్రభావంతో సముద్ర తీరంలో నది కోత తీవ్రమైందని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అల్పపీడనం స్థానికులను ఆందోళనకు గురి చేస్తోంది.
Similar News
News September 15, 2025
షాన్‌దార్ హైదరాబాద్.. ఇక పదిలం

HYD సంపద చారిత్రక కట్టడాలే. 12 వారసత్వ కట్టడాలను పరిరక్షించి వాటికి పూర్వ వైభవం తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. టెండర్లకు కూడా ఆహ్వానించింది. ఖైరతాబాద్ మసీదు, రొనాల్డ్ రాస్ భవనం, షేక్‌పేట మసీదు, చెన్నకేశవస్వామి గుడి, రేమండ్ సమాధి, హయత్‌బక్షిబేగం, పురానాపూల్ దర్వాజా, టోలి మసీదు, ఖజానా భవన్ (గోల్కొండ), షంషీర్ కోట, గన్‌ఫౌండ్రి, మసీదు ఇ మియన్ మిష్క్‌ను అద్భుతంగా తీర్చిదిద్దనున్నారు.
News September 15, 2025
జగిత్యాల బిడ్డకు ‘మిస్ చికాగో’ కిరీటం

న్యూజెర్సీలో ఈ నెల 12న నిర్వహించిన విశ్వసుందరి అందాల పోటీల్లో ‘మిసెస్ చికాగో యూనివర్స్- 2026’ టైటిల్‌ను జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన బొజ్జ సౌమ్యవాసు గెలుచుకున్నారు. అమెరికాలో స్థిరపడి, ప్రస్తుతం ఓ బహుళ జాతి సంస్థలో వెబ్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. వృత్తిపరమైన బాధ్యతలతో పాటు, సామాజిక కార్యకర్తగాను మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సౌమ్య ఈ ఏడాది మార్చిలో ధర్మపురికి వచ్చి వెళ్లారు.
News September 15, 2025
NGKL: ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని పరిశీలించిన కలెక్టర్

నాగర్‌కర్నూల్ మండలంలోని తూడుకుర్తి గ్రామంలో చేపట్టిన ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని కలెక్టర్ బాదావత్ సంతోష్ సోమవారం పరిశీలించారు. గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని నాణ్యతగా మరింత వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. గ్రామానికి చెందిన ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుడు పాండుతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.