News March 23, 2024

అల్లవరం: వడదెబ్బతో టాటా ఉద్యోగి మృతి 

image

అల్లవరం మండలం ఓడలరేవు ఓఎన్జీసీ అన్‌షోర్ టెర్మినల్‌లో పనిచేస్తున్న అదే గ్రామానికి చెందిన కొల్లు వెంకటరమణారావు(55) శనివారం వడదెబ్బతో మృతిచెందాడు. కుటుంబీకులు పోలీసులకు, రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. టాటా సంస్థలో స్టోర్ ఇన్‌ఛార్జిగా పనిచేస్తున్న రమణారావు కి.మీ దూరం నడిచి వెళ్లి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడన్నారు. బెండమూర్లంక పీహెచ్సీకి తరలించగా అప్పటికే మృతి చెందారన్నారు.

Similar News

News April 5, 2026

దండంగి కొండలపై పులి సంచారం

image

పోలవరం జిల్లా దండంగి కొండలపై పులి సంచారాన్ని శాటిలైట్ ద్వారా గుర్తించినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున వరకు అందిన సిగ్నల్స్ ఆధారంగా పులి ఆచూకీ లభ్యమైంది. ఇప్పటివరకు పోలవరం, తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాల్లో పులి 550 కి.మీ. ప్రయాణించినట్లు సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించారు. ప్రస్తుతం రంపచోడవరం వైపు వెళ్లే అవకాశం ఉండటంతో ఏజెన్సీ గ్రామస్థులను అధికారులు అప్రమత్తం చేశారు.

News April 5, 2026

ఏప్రిల్ 6న యథావిధిగా పీజీఆర్ఎస్

image

ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు ఏప్రిల్ 6న యథావిధిగా జరుగుతాయని కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం తెలిపారు. కలెక్టరేట్ నుంచి మండల స్థాయి వరకు అన్ని కార్యాలయాల్లో అధికారులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారని పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.