News January 31, 2025
అల్లవరం: సాప్ట్‌వేర్ ఇంజినీర్ మృతదేహం లభ్యం

అల్లవరం మండలం బోడసకుర్రు బ్రిడ్జిపై నుంచి యువకుడు దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. మలికిపురం(M) రామరాజులంకకు చెందిన జవ్వాది కృపాకిరణ్(25) విప్రోలో సాప్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. చెన్నైలో జాబ్ చేసే అతను ఇటీవల ఇంటికి వచ్చాడు. ఏమి జరిగిందో ఏమోగానీ మంగళవారం బ్రిడ్జిపై నుంచి దూకేశాడు. అతని మృతదేహం గురువారం లభ్యమైంది. వ్యక్తిగత సమస్యలే ఆత్మహత్యకు కారణమని కుటుంబ సభ్యులు తెలిపారు.
Similar News
News December 5, 2025
స్థానికులపై చిన్నచూపు లేదు: TTD ఈవో

వైకుంఠ ఏకాదశి దర్శనాల్లో తిరుపతి స్థానికులకు అన్యాయం జరిగిందని.. మొదటి మూడు రోజులు దర్శనాలు కల్పించి ఉంటే బాగుండేదని తిరుపతికి చెందిన చంద్రశేఖర్ డయల్ యువర్ TTD ఈవోలో కోరారు. ‘వైకుంఠ ద్వార దర్శనాలు పది రోజులు పవిత్రమైనవే. అందరినీ దృష్టిలో పెట్టుకుని, స్థానికులకు ఇబ్బంది కలగకూడదనే ఆలోచనతోనే చివరి మూడు రోజులు దర్శనాలకు కేటాయించాం. స్థానికులపై చిన్న చూపు లేదు’ అని ఈవో అనిల్ సింఘాల్ సమాధానమిచ్చారు.
News December 5, 2025
ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదు: సీఎం రేవంత్

TG: హనుమాన్ గుడిలేని ఊరు ఉండొచ్చు.. కానీ ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదని CM రేవంత్ అన్నారు. వరంగల్(D) నర్సంపేట సభలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీ వడ్డీలకే సరిపోయిందని, తాము ఒకేసారి ₹20,614Cr మాఫీ చేశామని తెలిపారు. ‘KCR పదేళ్లు రేషన్ కార్డులు ఇవ్వలేదు. మేం లక్షలాది మందికి ఇచ్చాం. 3.10 కోట్ల మందికి సన్నబియ్యం ఇస్తున్నాం. ఇలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం’ అని చెప్పారు.
News December 5, 2025
వరి నారుమడిలో కలుపు యాజమాన్యం

వరి నారుమడిలో కలుపు ప్రధాన సమస్యగా ఉంటుంది. దీని నివారణకు 5 సెంట్ల నారుమడిలో విత్తిన 3 నుంచి 5 రోజుల లోపు పైరజోసల్ఫ్యూరాన్-ఇథైల్ 10% W.P లేదా ప్రిటిలాక్లోర్+సేఫ్‌నర్ 20mlను ఒక కిలో పొడి ఇసుకలో కలిపి చల్లుకోవాలి. అలాగే విత్తిన 15-20 రోజులకు గడ్డి, వెడల్పాకు కలుపు నివారణకు 5 సెంట్లకు 10 లీటర్ల నీటిలో బిస్పైరిబాక్ సోడియం 10% S.L 5ml కలిపి పిచికారీ చేయాలి.


