News March 29, 2025

అల్లా కటాక్షంతో ప్రజలు సుభిక్షంగా వర్ధిల్లాలి: CM రేవంత్

image

రంజాన్ మాసం ఎంతో పవిత్రమైందని రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ఉపవాస దీక్షలతో అల్లాను కొలుస్తారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం కొడంగల్ పట్టణంలో ప్రభుత్వ పరంగా నిర్వహించిన “రంజాన్ ఇఫ్తార్ విందు”లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అల్లా కటాక్షంతో ప్రజలు సుభిక్షంగా ఉండాలన్నారు. ప్రజా ప్రతినిధులు, మైనారిటీ సోదరులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

Similar News

News October 23, 2025

మహబూబ్‌నగర్: నేడు ఉద్యోగ మేళా

image

MBNRలోని ఎంప్లాయ్మెంట్ కార్యాలయంలో ఉ.10:30- మ.2:00 వరకు ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారిణి మైత్రి ప్రియ Way2Newsతో తెలిపారు. 3 ప్రైవేట్ సంస్థలలో 370 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని, SSC, ఇంటర్, డిగ్రీ ఉండాలన్నారు. అభ్యర్థుల వయసు 18-30 ఉండాలని, ఆధార్, సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. SHARE IT.

News October 22, 2025

మయూర వాహనంపై ఊరేగిన కురుమూర్తి రాయుడు

image

కురుమూర్తిస్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అయితే బుధవారం స్వామిని పల్లకి సేవలో మయూర వాహనంపై భక్తులు ఊరేగించారు. స్వామి వారి ఆలయం నుంచి మెట్ల దారిలో భక్తులు గోవిందా, గోవిందా అంటూ భక్తితో గోవింద నామస్మరణలతో స్వామి వారిని ఊరేగించి తరించారు. ఆలయ ఛైర్మన్ గౌని గోవర్ధన్ రెడ్డి, కార్యనిర్వహణ అధికారి సి.మదనేశ్వర్ రెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు, పలువురు పాల్గొన్నారు.

News October 22, 2025

నవాబు పేట్: కరెంట్ షాక్‌తో డ్రైవర్ మృతి

image

మండలంలోని యన్మన్‌గండ్లకు చెందిన జగదీశ్ (28) బుధవారం విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. ఓ రైతు పొలంలోకి నర్సరీ చెట్లను తీసుకెళ్తుండగా కంచెలోని విద్యుత్ వైర్లను తప్పించే క్రమంలో ప్రమాదవశాత్తూ షాక్ తగిలి అక్కడికక్కడే మరణించాడు. మృతుడితో ఉన్న నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. జగదీశ్ బులెరో నడుపుతూ జీవనం సాగించేవాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రికి తరలించారు. భార్య, ఇద్దరు పిల్లలున్నారు.