News January 12, 2025

అల్లుడి బైక్‌ ఢీకొని మామ మృతి

image

శ్రీ సత్యసాయి జిల్లా రొళ్ల మం. చిగమంత్ ఘట్టలో బైక్ ఢీకొని వ్యక్తి మృతిచెందాడు. గ్రామస్థుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన చిత్తప్ప పొలానికి వెళ్లి ఇంటికి వస్తున్నాడు. ఈ క్రమంలో తన అల్లుడు మహేశ్ ద్విచక్ర వాహనంపై అజాగ్రత్తగా వెళ్లి చిత్తప్పను ఢీ కొన్నాడు. ఘటనలో అతడికి గాయాలయ్యాయి. ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మృతిడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Similar News

News November 2, 2025

రేపు కలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్ కార్యక్రమం: కలెక్టర్

image

అనంతపురం జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఆనంద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లా ప్రజలు తమ సమస్యలను అర్జీల ద్వారా అందజేయాలన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.

News November 2, 2025

రెడ్ క్రాస్ సేవలు ప్రజలకు మరింత చేరువ కావాలి: కలెక్టర్

image

జిల్లాలో రెడ్ క్రాస్ సేవలు ప్రజలకు మరింత చేరువుగా తీసుకెళ్లాలని జిల్లా కలెక్టర్, రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షుడు ఆనంద్ పేర్కొన్నారు. శనివారం కలెక్టర్‌లోని మినీ కాన్ఫరెన్స్ లో భారతీయ రెడ్ క్రాస్ సమైక్య అనంతపురం శాఖ కార్యకలాపాలను సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రక్త కేంద్రాలలో సరిపడా రక్త నిల్వ ఉండేలా చూసుకోవడం ముఖ్యమైందని తెలిపారు.

News November 1, 2025

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు: కలెక్టర్

image

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ ఆనంద్ హెచ్చరించారు. అనంతపురం కలెక్టరేట్లో వైద్య ఆరోగ్యశాఖ సమీక్ష సమావేశం జరిగింది. జిల్లాలో త్రైమాసికంలో జరిగిన మాతా శిశు మరణాలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా అనంతపురం రూరల్ కురుగుంట-2, యాడికి-1, రాయదుర్గం-1, కొర్రపాడు-1 UPHCలో జరిగిన మాతృమరణాలపై కలెక్టర్ ఆరా తీశారు.