News January 28, 2025

అల్లూరిని పర్యాటకంగా అభివృద్ధి చేయాలి : కలెక్టర్

image

అల్లూరి జిల్లాలో 73 శాతం అటవీ, ప్రకృతి అందాలు ఉన్నాయని, దీన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. సోమవారం విశాఖలో జరిగిన ప్రాంతీయ పెట్టుబడిదారుల సదస్సులో ఆయన, అరకుతో పాటు లంబసింగి, మారేడుమిల్లి వరకు పదుల సంఖ్యలో అద్భుతమైన సహజ ప్రకృతి సౌందర్య ప్రదేశాలున్నాయన్నారు. వాటన్నింటిని సర్క్యూట్‌గా చేస్తే పర్యాటకులను ఆకర్షించవచ్చన్నారు.

Similar News

News December 6, 2025

GNT: రూ.10కి వ్యర్థాలు.. ప్రమాదంలో ప్రజల ఆరోగ్యం

image

ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో చేపల చెరువుల్లో నిషేధిత చికెన్ పేగులు, హోటల్ వ్యర్థాల వాడుతున్నారు. చాలా ప్రాంతాల్లో చేపల మేత కోసం వ్యర్థాలను కిలో రూ.10 చొప్పున కొని ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. గోదావరి జిల్లాల్లో నిషేధించిన ఈ వ్యర్థాలను ఇక్కడ మాత్రం గోప్యంగా కొనసాగుతున్నాయి. అధికారులు వెంటనే స్పందించి వ్యర్ధాలను నిషేధించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

News December 6, 2025

నంద్యాల: ‘అమ్మా, నాన్న ఆశీర్వదించండి’

image

బండి ఆత్మకూరులోని ఏపీ మోడల్ పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్ సమావేశం సందర్భంగా పదో తరగతి విద్యార్థి ముబీనా వేసిన చిత్రం అందరినీ ఆకట్టుకుంది. తల్లి, తండ్రి, గురువు, దైవం అనే సూక్తిలో మొదటి రెండు స్థానాలు తల్లిదండ్రులవే. అందులో భాగంగా చిన్నారులు తల్లిదండ్రులకు పాదాభివందనం చేస్తూ ఆశీర్వాదం పొందుతున్న చిత్రాన్ని చూసిన అతిథులు.. ముబీనాను అభినందించారు.

News December 6, 2025

కృష్ణా: వర్క్ ఫ్రమ్ హోమ్ పరీక్షలపై అవగాహన కల్పించరా.?

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలో నిరుద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఉద్యోగాల కోసం అన్ని సచివాలయాల్లో ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. DEC 2-6 మధ్య తొలివిడత పరీక్షలు జరుగుతుండగా, ఎన్టీఆర్ జిల్లాలో 84 వేలు, కృష్ణాలో 50 వేల మంది అర్హులున్నారు. అయితే కొందరు నిరుద్యోగులు తమకు సమాచారం లేదని వాపోతున్నారు. అధికారులు అవగాహన కల్పించాలని కోరుతున్నారు. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారికి కంపెనీలు జాబ్స్ ఇవ్వనున్నాయి.