News January 28, 2025
అల్లూరిని పర్యాటకంగా అభివృద్ధి చేయాలి : కలెక్టర్

అల్లూరి జిల్లాలో 73 శాతం అటవీ, ప్రకృతి అందాలు ఉన్నాయని, దీన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. సోమవారం విశాఖలో జరిగిన ప్రాంతీయ పెట్టుబడిదారుల సదస్సులో ఆయన, అరకుతో పాటు లంబసింగి, మారేడుమిల్లి వరకు పదుల సంఖ్యలో అద్భుతమైన సహజ ప్రకృతి సౌందర్య ప్రదేశాలున్నాయన్నారు. వాటన్నింటిని సర్క్యూట్‌గా చేస్తే పర్యాటకులను ఆకర్షించవచ్చన్నారు.
Similar News
News February 10, 2025
హరీశ్ రావు లేఖకు కేంద్ర మంత్రి స్పందన

సిద్దిపేట-ఎల్కతుర్తి జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా నంగునూరు మండలం రాజగోపాల్ పేట గ్రామంలో సెంట్రల్ లైటింగ్, ఫుట్ పాత్, డ్రైనేజీ ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కారికి మాజీ మంత్రి, MLA హరీశ్ రావు ఇటీవల లేఖ రాశారు. దీనిపై స్పందించిన గడ్కారీ తిరిగి లేఖ రాస్తూ జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా మీరు కోరిన పనుల ఏర్పాటుకు అధికారులకు తగిన ఆదేశాలు ఇచ్చామన్నారు. దీంతో హరీశ్ రావు ధన్యవాదాలు తెలిపారు.
News February 10, 2025
వనపర్తి: జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తాం: చిన్నారెడ్డి

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తామని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. హెల్త్ కార్డులపై త్వరలో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అధికారులతో సమీక్ష చేస్తామన్నారు. ప్రజలు, జర్నలిస్టుల ఆరోగ్యం విషయంలో రాజీ పడేది లేదన్నారు. ఇప్పటికే ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షల వరకు పెంచామని తెలిపారు. త్వరలో ఆరోగ్యశ్రీ అధికారులతో జర్నలిస్టుల విషయమై సమీక్ష చేసి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.
News February 10, 2025
కేసముద్రంలో నాలుగు కిలోల గంజాయి పట్టివేత

మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో 4కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. సీఐ సర్వయ్య తెలిపిన వివరాలిలా.. నమ్మదగిన సమాచారం మేరకు 3 వ్యక్తులు అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్నారని తెలిసింది. దీంతో ఎస్సై మురళీధర్ తన సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు. ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వారి వద్ద తనిఖీ చేయగా 4కిలోల గంజాయి దొరికిందని సీఐ తెలిపారు.