News March 24, 2025
అల్లూరిలో ఆటో బోల్తా: ఒకరు మృతి

అల్లూరి జిల్లా పాడేరు మండలం రణంకోట సమీపంలో ఆదివారం రాత్రి ఆటో బోల్తా పడి ఒకరు మృతి చెందారు. ఈదులపాలెం నుంచి అయినాడ వెళ్తున్న ఆటో రణంకోట ఘాటి వద్ద బ్రేకులు ఫెయిలై బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. మారుమూల ప్రాంతం కావడంతో సహాయక చర్యలు అంతరాయం ఏర్పడింది. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 9, 2025
నంద్యాల: ఘోర ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

డోన్ మండలం కొత్తపల్లి బ్రిడ్జి సమీపంలోని జాతీయ రహదారిపై ఇవాళ తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందినట్టు స్థానికులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News December 9, 2025
‘స్టార్‌లింక్’ ధరలు ప్రకటించలేదు.. క్లారిటీ ఇచ్చిన సంస్థ

భారత్‌లో ‘స్టార్‌లింక్’ సేవల ధరలు ఇప్పటివరకు ప్రకటించలేదని సంస్థ స్పష్టం చేసింది. ఇటీవల స్టార్‌లింక్ ఇండియా వెబ్సైట్లో నెలకు రూ.8,600 ఛార్జీలు, హార్డ్‌వేర్ కిట్ రూ.34,000గా <<18504876>>చూపడాన్ని<<>> ‘కాన్ఫిగరేషన్ గ్లిచ్’గా కంపెనీ పేర్కొంది. అవి కేవలం డమ్మీ డేటా మాత్రమేనని, అసలు ధరలు ఇంకా ఫిక్స్ చేయలేదని అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ అనుమతులు పూర్తయ్యాకే సేవలు ప్రారంభమవుతాయని క్లారిటీ ఇచ్చారు.
News December 9, 2025
HYD: పడిపోలేదు.. జస్ట్ ఒరిగిందంతే!

చూడటానికి యాడ్ బోర్డుపై స్తంభం రెస్ట్ తీసుకుంటున్నట్లు ఉన్న ఈ విజ్యువల్ పెద్దఅంబర్‌పేట్ NH-65పైది. జులైలో భారీ ఈదరుగాలులు, వర్షం ధాటికి ఈ లైన్ ఏబీ స్విఛ్ స్తంభం కిందపడేది. కానీ బోర్డు పక్కనే ఉండటంతో దానిపై వాలింది. 5నెలలు గడుస్తున్నా ఇప్పటికీ చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. హైవేపైన ఉన్నదానికే స్పందనలేకపోతే ఇక గల్లీల్లో ఎలా ఉంటుందోనని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.


