News March 19, 2025
అల్లూరిలో 92మంది దూరం

అల్లూరి జిల్లాలో మొత్తం 71 పరీక్షా కేంద్రాల్లో బుధవారం టెన్త్ హిందీ పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని DEO. బ్రహ్మాజీరావు తెలిపారు. మొత్తం 11,548మంది విద్యార్థులకు 11,45 మంది హాజరయ్యారు. 92మంది పరీక్షలకు ఆబ్సెంట్ అయ్యారని తెలిపారు. 99.20శాతం హాజరు నమోదైయిందని చెప్పారు. సరివేలు, ముంచింగిపుట్టు, జోలాపుట్టు పరీక్ష కేంద్రాలను పరిశీలించినట్లు తెలిపారు.
Similar News
News November 26, 2025
HYD: బీసీ రిజర్వేషన్లపై రాహుల్ గాంధీని ప్రశ్నించిన KTR

తెలంగాణలో కులగణన దేశానికి ఆదర్శమని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్ ‘X’ లో ఘాటుగా స్పందించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని, రూ.160 కోట్లు ఖర్చు చేశామని చెప్పిన రాహుల్ గాంధీ, పంచాయతీ ఎన్నికల్లో కేవలం 17% రిజర్వేషన్లు ఎందుకు ఇచ్చారో సమాధానం చెప్పాలని KTR ప్రశ్నించారు.
News November 26, 2025
రాజ్యాంగ విలువలు కాపాడాలి: నల్గొండ అదనపు ఎస్పీ

జిల్లా పోలీస్ కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవం ఈరోజు ఘనంగా జరిగింది. అదనపు ఎస్పీ రమేశ్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. రాజ్యాంగ నిర్మాతలను స్మరించుకుని, హక్కులు, న్యాయం, సమానత్వం వంటి రాజ్యాంగ విలువలను కాపాడాలని సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. అదనపు ఎస్పీ మాట్లాడుతూ.. రాజ్యాంగం దేశానికి మార్గదర్శకమని, దాని స్ఫూర్తిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సూచించారు.
News November 26, 2025
ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు ఉంటే చెప్పండి: మంత్రి నాదెండ్ల

ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఇబ్బందులు ఉంటే చెప్పండి అంటూ రాష్ట్ర పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ రైతులను కోరారు. బుధవారం ఉంగుటూరు మండలం నారాయణపురం గ్రామంలో రైతుల దగ్గరకి వెళ్లి ధాన్యం కొనుగోలులో ఉన్న ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు జరిగిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతుందన్నారు. మంత్రి వెంట ఎమ్మెల్యే ధర్మరాజు ఉన్నారు.


