News March 19, 2025
అల్లూరిలో 92మంది దూరం

అల్లూరి జిల్లాలో మొత్తం 71 పరీక్షా కేంద్రాల్లో బుధవారం టెన్త్ హిందీ పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని DEO. బ్రహ్మాజీరావు తెలిపారు. మొత్తం 11,548మంది విద్యార్థులకు 11,45 మంది హాజరయ్యారు. 92మంది పరీక్షలకు ఆబ్సెంట్ అయ్యారని తెలిపారు. 99.20శాతం హాజరు నమోదైయిందని చెప్పారు. సరివేలు, ముంచింగిపుట్టు, జోలాపుట్టు పరీక్ష కేంద్రాలను పరిశీలించినట్లు తెలిపారు.
Similar News
News April 24, 2025
మోదీ సర్కారుపై సంచలన ఆరోపణలు.. ఎమ్మెల్యే అరెస్టు

పహల్గామ్ ఉగ్రదాడిలో మోదీ సర్కారు కుట్ర ఉందన్న అస్సాం AIDUF ఎమ్మెల్యే <<16202042>>అమినుల్ ఇస్లాంను<<>> పోలీసులు అరెస్టు చేశారు. పాకిస్థాన్‌కు సపోర్ట్ చేసినా, సపోర్ట్ చేయడానికి ప్రయత్నించినా సహించేది లేదని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ స్పష్టం చేశారు. సదరు ఎమ్మెల్యేపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కాగా దేశంలో మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టేందుకు కేంద్రం ప్రయత్నం చేస్తోందని అమినుల్ చేసిన కామెంట్స్ సంచలనమయ్యాయి.
News April 24, 2025
తారాబు జలపాతం వద్ద యువకుడి గల్లంతు

పెదబయలు మండలంలో గల ప్రముఖ పర్యాటక ప్రాంతమైన తారాబు జలపాతంలో ఓ యువకుడు గల్లంతైనట్టు స్థానిక ఎస్‌ఐ రమణ తెలిపారు. పెందుర్తిలోని ఓ కాలేజీలో బీటెక్ చదువుతున్న నలుగురు యువకులు గురువారం జలపాతానికి వచ్చారన్నారు. వీరిలో వెస్ట్ గోదావరి జిల్లా భీమడోలుకి చెందిన గొన్నూరి కిషోర్ (22) జలపాతంలో ఈత కొడుతూ గల్లంతయ్యాడని తెలిపారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినా కిషోర్ ఆచూకీ లభ్యం కాలేదని వెల్లడించారు.
News April 24, 2025
ఈ ‘హీరో’యిన్‌ను మెచ్చుకోవాల్సిందే..

ఉగ్రదాడిపై స్పందించేందుకు సెలబ్రిటీలు తటపటాయిస్తుంటే తెలుగు హీరోయిన్ అనన్య నాగళ్ల చేసిన పనికి ఆమెపై ప్రశంసలు వెల్లువెత్తాయి. ఉగ్రదాడిలో మరణించిన మధుసూదన్ (నెల్లూరు) భౌతికకాయానికి నివాళులు అర్పించిన ఆమె, కుటుంబసభ్యులకు సానుభూతి తెలియజేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా గతేడాది విజయవాడ, ఖమ్మం వరదల సమయంలోనూ తన వంతు బాధ్యతగా రూ.5 లక్షల విరాళం ప్రకటించారు.