News February 17, 2025

అల్లూరి: అడవిరాజులబాబు పండుగపై బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్

image

అల్లూరి జిల్లాలో ఆదివాసీలు జరుపుకొనే అడవిరాజులబాబు పండుగపై బర్డ్ ఫ్లూ ప్రభావం కనిపిస్తోంది. కోళ్లు, మేకలను కోసి అడవుల్లో వంటలు చేసుకోవడం ఈ పండుగలో ఒక భాగం. అయితే బర్డ్ ఫ్లూ కారణంగా మార్కెట్‌లో కోళ్లు దొరకని పరిస్థితి నెలకొంది. దీంతో నాటు కోళ్లకు డిమాండ్ పెరిగింది. కాగా.. రాజవొమ్మంగిలో పండగరోజు 2,400 కిలోల మాంసం అమ్ముడుపోయేదని.. కానీ 1,200 కిలోల చికెన్ మాత్రమే అమ్ముడు పోతుందని వ్యాపారులు తెలిపారు. 

Similar News

News July 11, 2025

జగిత్యాల మెడికల్‌ ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు స్వీకరించిన డా. షర్మిల

image

జగిత్యాల ప్రభుత్వ వైద్య కళాశాల కొత్త ప్రిన్సిపాల్‌గా డాక్టర్‌ జి. షర్మిల గురువారం బాధ్యతలు స్వీకరించారు. వరంగల్‌లోని క్యాతం చందయ్య మెమోరియల్‌ మెటర్నిటీ ఆసుపత్రిలో గైనకాలజీ ప్రొఫెసర్‌గా, సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న ఆమెను పదోన్నతిపై జగిత్యాల మెడికల్‌ కళాశాల ప్రిన్సిపల్‌గా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం కళాశాలకు వచ్చిన ఆమెకు సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు.

News July 11, 2025

చనిపోయినట్లు ప్రకటించిన 12 గంటలకు లేచిన శిశువు!

image

మహారాష్ట్రలో ఓ వింత సంఘటన జరిగింది. చనిపోయిందనుకున్న శిశువు 12 గంటల తర్వాత తిరిగి బతికింది. బీద్‌లోని రామానంద తీర్థ్ ఆస్పత్రిలో ఓ మహిళ 7వ నెలలోనే 900 గ్రాములున్న శిశువుకు జన్మనిచ్చింది. ఆ బేబీని రాత్రంతా ICUలో ఉంచి ఆ తర్వాత చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు. ఖననం చేసే సమయంలో ముసుగు తీసి చూడగా కదలాడుతున్నట్లు కనిపించింది. వెంటనే వారు ఆ శిశువును మరో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

News July 11, 2025

రికార్డులు ఉండేది బద్దలు కొట్టడానికే: లారా

image

ఈసారి <<16983109>>క్వాడ్రాపుల్ సెంచరీ<<>>కి అవకాశమొస్తే బాదేయాలని వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా చెప్పినట్లు సౌతాఫ్రికా కెప్టెన్ వియాన్ ముల్డర్ తెలిపారు. ‘నీ సొంత లెగసీ సృష్టించుకోవాలి. రికార్డులు ఉండేది బద్దలు కొట్టడానికే. మళ్లీ 400 కొట్టే ఛాన్స్ వస్తే వదులుకోకు’ అని లారా చెప్పినట్లు ముల్డర్ తెలిపారు. కాగా లారా(400*) రికార్డును అధిగమించే ఉద్దేశం లేకే 367* స్కోర్ వద్ద డిక్లేర్ చేసినట్లు ముల్డర్ వెల్లడించారు.