News February 16, 2025

అల్లూరి అనుచరులకు అపార్ట్మెంట్‌లు సిద్ధం

image

అల్లూరి వారసులకు కొయ్యూరు మండలం నడింపాలెం వద్ద డబుల్ బెడ్ రూమ్ అపార్ట్మెంట్లు సిద్ధం అయ్యాయి. స్వాతంత్ర్య పోరాటంలో నాటి బ్రిటిష్ అధికారులను గడగడలాడించిన విప్లవవీరుడు అల్లూరికి కుడిభుజంగా పనిచేసిన గాం గంటన్నదొర, మల్లుదొరకు చెందిన 11 కుటుంబాలకు క్షత్రియ పరిషత్ వీటిని ₹3.5 కోట్లతో నిర్మించింది. వీటిని అల్లూరి జిల్లా కలెక్టర్ ఏ.ఎస్ దినేశ్ కుమార్ సోమవారం ప్రారంభిస్తారు.

Similar News

News November 26, 2025

ASF జిల్లాలో డిసెంబర్ 1 నుంచి పరీక్షలు

image

ASF జిల్లాలో డిసెంబర్ 1 నుంచి 6వ తేదీ వరకు 2024-25 బ్యాచ్ అభ్యర్థులకు, గత బ్యాచ్‌లో అనుతీర్ణులైన అభ్యర్థులకు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాధికారి దీపక్ తివారి తెలిపారు. పరీక్ష నిర్వహణ కోసం ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పరీక్షా కేంద్రం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

News November 26, 2025

నల్గొండ: పౌరులందరి హక్కులకు రాజ్యాంగం రక్ష: ఇన్‌ఛార్జ్ డీఆర్ఓ

image

భారత రాజ్యాంగం దేశంలోని పౌరులందరి హక్కులకు రక్షణ కల్పిస్తుందని ఇన్‌ఛార్జి జిల్లా రెవెన్యూ అధికారి వై.అశోక్ రెడ్డి అన్నారు. నల్గొండ కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. రాజ్యాంగంలో పొందుపరిచిన మౌలిక హక్కులు, బాధ్యతలు ప్రతి పౌరుడు తప్పనిసరిగా తెలుసుకొని, వాటిని ఆచరించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.

News November 26, 2025

AI చెప్పిన.. టాలీవుడ్ టాప్ హీరోలు వీరే

image

ఏఐ చాట్‌బోట్లయిన జెమిని, చాట్ Gpt, గ్రోక్‌లు టాలీవుడ్‌లో నంబర్ 1 హీరో డార్లింగ్ ప్రభాస్ అని ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయని సినీవర్గాలు తెలిపాయి. gemini: ప్రభాస్, అల్లు అర్జున్, NTR, రామ్ చరణ్, మహేశ్ బాబు. – Chatgpt: ప్రభాస్, మహేశ్ బాబు, అల్లు అర్జున్, NTR, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ – Grok- ప్రభాస్, అల్లు అర్జున్, మహేశ్ బాబు, NTR, రామ్ చరణ్, పవన్. మరి మీ దృష్టిలో టాప్-6 టాలీవుడ్ హీరోలెవరు?COMMENT