News February 13, 2026
అల్లూరి: ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు అస్వస్థత

అడ్డతీగల బాలికల ఆశ్రమ పాఠశాలలో ఏడుగురు విద్యార్థులు శుక్రవారం అస్వస్థతకు గురై స్థానిక సీహెచ్సీలో చేరారు. డీఎంహెచ్‌వో సరిత ఆసుపత్రికి వచ్చి వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులు కడుపునొప్పి, వాంతులతో ఆసుపత్రిలో చేరారని, ప్రస్తుతం వారి పరిస్థితి బాగుండడంతో అయిదుగురిని డిశ్చార్జ్ చేశారన్నారు. హాస్టల్లో 24 గంటలు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశామన్నారు.
Similar News
News March 17, 2026
పాక్ దాడి పిరికిపంద చర్య: భారత్

అఫ్గానిస్థాన్‌లోని ఆస్పత్రిపై <<19403539>>పాకిస్థాన్ దాడిని<<>> భారత్ ఖండించింది. రంజాన్ వేళ ఇలా చేయడం దారుణమని మండిపడింది. దీన్ని అఫ్గాన్ సార్వభౌమత్వంపై దాడిగా పరిగణిస్తున్నట్లు తెలిపింది. ఇది మిలిటరీ దాడి కాదు మారణహోమమని పేర్కొంది. ఇదొక పిరికిపంద చర్యగా అభివర్ణించింది. కాగా పాక్ దాడిలో దాదాపు 400 మంది అమాయకులు మరణించారు.
News March 17, 2026
కర్నూలు జిల్లాలో 358 మంది విద్యార్థులు గైర్హాజరు

కర్నూలు జిల్లా వ్యాప్తంగా మంగళవారం జరిగిన ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలకు 358 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి లాలప్ప తెలిపారు. మొత్తం 18,104 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా, 17,746 మంది మాత్రమే హాజరయ్యారని వెల్లడించారు. జిల్లాలో పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని, ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని ఆయన స్పష్టం చేశారు.
News March 17, 2026
KTR వ్యాఖ్యలకు కోమటిరెడ్డి కౌంటర్

TG: గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు <<19405508>>ఎందుకు<<>> చెప్పాలన్న KTR వ్యాఖ్యలకు మంత్రి కోమటిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. ‘మీరు ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వనందుకు, మేం కొత్త కార్డులతో పాటు సన్నబియ్యం ఇస్తున్నందుకు KTR ధన్యవాదాలు చెప్పాలి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అన్ని గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు, యంగ్ ఇండియా స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నందుకు థాంక్స్ చెప్పాలి’ అని స్పష్టం చేశారు.


