News March 15, 2025
అల్లూరి: ఇంటర్ పరీక్షలకు 195మంది గైర్హాజరు

అల్లూరి జిల్లాలో 26 పరీక్ష కేంద్రాల్లో శనివారం ద్వితీయ ఇంటర్ జనరల్ కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలు జరిగాయి. జనరల్ పరీక్షలకు మొత్తం 4,170మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 4050మంది రాసారని, 116ఆబ్సెంట్ అయ్యారని జిల్లా ఇంటర్మీడియేట్ విద్యాధికారి అప్పలరాం తెలిపారు. 8కేంద్రాల్లో ఒకేషనల్ పరీక్షలకు 884మందికి గాను 805మంది హాజరు అయ్యారని, 79మంది ఆబ్సెంట్ అయ్యారని తెలిపారు.
Similar News
News October 24, 2025
జాబ్ మేళా 2 రోజులు కొనసాగుతోంది: మంత్రి ఉత్తమ్

హుజూర్నగర్లో ఈ నెల 25న నిర్వహించే జాబ్ మేళా మరుసటి రోజు 26తేదీ కూడా కొనసాగించనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిరుద్యోగుల నమోదు 30 వేల వరకు ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. జాబ్ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు ఈ విషయం గమనించాలని సూచించారు. మరుసటి రోజు కూడా భోజన, ఇతర వసతులు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.
News October 24, 2025
2 రోజులు వర్షాలు.. జాగ్రత్తలు తీసుకోండి: కలెక్టర్

రానున్న 2 రోజులు వర్ష సూచన ఉన్నందున, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ధాన్యం త్వరగా మిల్లులకు తరలించాలని, కొనుగోలు కేంద్రాలలో టార్పాలిన్లు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. నాణ్యత లేని ధాన్యాన్ని నింపి పంపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులు ఈ 2 రోజులు కోతలు వాయిదా వేసుకోవాలన్నారు.
News October 24, 2025
MBNR: డిగ్రీ ఫీజుకు నేడే ఆఖరు

పాలమూరు యూనివర్సిటీ డిగ్రీ 3, 5 సెమిస్టర్ (రెగ్యులర్, బ్యాక్లాగ్) పరీక్షల ఫీజు కట్టేందుకు నేటితో గడువు ముగియనుంది. ఈ నెల 29 వరకు ఫైన్ (లేట్ ఫీజు)తో ఫీజులు చెల్లించ వచ్చని అధికారులు తెలిపారు. మొదటి సెమిస్టర్ బ్యాక్లాగ్ ఫీజును ఎలాంటి ఫైన్ లేకుండా చెల్లించడానికి శనివారం వరకు అవకాశం ఉందన్నారు. లేట్ ఫీజుతో ఈ నెల 29 వరకు ఫీజు కట్టవచ్చని వెల్లడించారు.


