News March 5, 2025
అల్లూరి: ఇంటర్ పరీక్షలకు 209మంది విద్యార్థులు గైర్హాజరు

అల్లూరి జిల్లా లో బుధవారం జరిగిన ఇంటర్మీడియేట్ ద్వితీయ ఇంటర్ పరీక్షకు 209మంది ఆబ్సెంట్ అయ్యారని జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి అప్పలరాం తెలిపారు. జిల్లాలో 26పరీక్ష కేంద్రాల్లో ఇంగ్లిష్ 2పేపర్కు 5464మందికి గాను 5330మంది హజరు కాగా 134మంది గైర్హాజరు అయ్యారని తెలిపారు. 8పరీక్ష కేంద్రాల్లో జరిగిన ఒకేషనల్ పరీక్షకు 1212మందికి గాను 1137మంది హాజరు అయ్యారని, 75మంది ఆబ్సెంట్ అయ్యారని తెలిపారు.
Similar News
News November 20, 2025
₹600Crతో TG పోలీసు AMBIS అప్గ్రేడ్

TG పోలీస్ శాఖ నేర పరిశోధన వేగాన్ని పెంచేందుకు ఆటోమేటెడ్ మల్టీమోడల్ బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్(AMBIS)ను అప్గ్రేడ్ చేస్తోంది. పాతబడిన సర్వర్లు, స్టోరేజ్ స్థానంలో లేటెస్ట్ టెక్నాలజీని వినియోగించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ₹600Cr మంజూరు చేసింది. ఈ వ్యవస్థ అన్ని PSలలోని పరికరాలను లింక్ చేస్తుంది. AI సాయంతో సెకన్లలోనే బయోమెట్రిక్ మ్యాచింగ్ పూర్తవుతుంది.
News November 20, 2025
మొక్కజొన్నలో పాము పొడ తెగులును ఎలా గుర్తించాలి?

పాము పొడ తెగులు ముందుగా నేలకు దగ్గరగా ఉండే మొక్కజొన్న మొక్కల కింది ఆకులపై సోకుతుంది. తర్వాత పై ఆకులకు, కాండానికి వ్యాపిస్తుంది. వ్యాధి సోకిన మొక్కల ఆకులు, కాండంపై బూడిద, గోధుమ వర్ణపు మచ్చలు ఒకదాని తర్వాత ఒకటి ఏర్పడి.. చూడటానికి పాముపొడ వలే కనిపిస్తాయి. కాండంపై ఏర్పడిన తెగులు లక్షణాల వల్ల కణుపుల వద్ద మొక్కలు విరిగి నేలపై పడిపోతాయి. దీని వల్ల మొక్కల సంఖ్య తగ్గి పంట దిగుబడి పడిపోతుంది.
News November 20, 2025
HYD: ఓయూలో “రిక్రూట్మెంట్ డ్రైవ్”

ఉస్మానియా విశ్వవిద్యాలయం హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ సెంటర్ (HCDC) ఆధ్వర్యంలో సాయి లైఫ్ సైన్సెస్ లిమిటెడ్ సంస్థ కోసం కాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ను CFRD భవనంలోని e-క్లాస్రూమ్ క్యాంపస్లో నిర్వహించారు. OUకి చెందిన ఎంఎస్సీ (ఆర్గానిక్ కెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ) ప్రత్యేకతల విద్యార్థులకు మాత్రమే నిర్వహించారు. మొత్తం 150 మంది విద్యార్థులు పాల్గొన్నారు.


