News March 1, 2025

అల్లూరి: ఇంటర్ పరీక్షలు.. 666 మంది గైర్హాజరు

image

అల్లూరి జిల్లాలో శనివారం జరిగిన ఇంటర్ పరీక్షలకు 666మంది అయ్యారని జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారి అప్పలరాం తెలిపారు. సాధారణ పరీక్ష తెలుగు 1కి 6,350 మంది విద్యార్థులకు గాను 5,892 మంది హజరైయ్యారని అని పేర్కొన్నారు. 458మంది హాజరు కాలేదని తెలిపారు. ఒకేషనల్ పరీక్ష‌కు 1,301 మంది విద్యార్థులకు గాను 1,093 మంది హజరు కాగా 208మంది గైర్హాజరు అయ్యారని తెలిపారు.

Similar News

News March 25, 2025

ఆ హీరోయిన్‌ మృతితో హీరోకు సంబంధం లేదు: మాజీ ప్రియుడు

image

దక్షిణ కొరియా నటి <<15483613>>కిమ్ సె రాన్<<>> మృతికి నటుడు కిమ్ సూ హ్యూన్, మరో యూట్యూబర్ కారణం కాదని ఆమె మాజీ ప్రియుడు స్పష్టం చేశారు. నిజానికి తనను పట్టించుకోని కుటుంబం వల్లే ఆమె ఎంతో వేదన చెందారని తెలిపారు. న్యూయార్క్‌లో ఆమె రహస్యంగా ఒకరిని పెళ్లిచేసుకొని లైంగిక బంధం కొనసాగించారని వెల్లడించారు. ఇన్నాళ్లూ పట్టించుకోని కుటుంబం ఇప్పుడొచ్చి వేరొకరిని నిందిస్తుండటం బాధాకరమని విమర్శించారు.

News March 25, 2025

సౌలభ్యాన్ని బట్టి త్వరలోనే బకాయిల విడుదల: సీఎం

image

AP: గ‌త ప్ర‌భుత్వం ఉద్యోగులకు రూ.20,637 కోట్ల అలవెన్సులను ఎగ్గొట్టిందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ తాము ఇప్పటికే రూ.7,230 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. త్వరలోనే సౌలభ్యాన్ని బట్టి మిగిలిన బకాయిలను అకౌంట్లలో జమ చేస్తామని కలెక్టర్ల సదస్సులో హామీ ఇచ్చారు. ఉద్యోగులు ప్ర‌భుత్వం చేప‌డుతున్న కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌డానికి చొర‌వ తీసుకోవాల‌ని పిలుపునిచ్చారు.

News March 25, 2025

జాతీయ ఆహార భద్రత మిషన్ పేరు మార్చారా?

image

కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆహార భద్రత మిషన్ పేరు మార్చిందా అని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. ఈ మేరకు లోక్ సభలో ఆయన పలు అంశాలపై చర్చించారు. పోషకాహార లక్ష్యాల సాధనలో జాతీయ ఆహార భద్రత మిషన్ పేరు మార్పు ఎంతవరకు సహాయపడుతుందని ప్రశ్నించారు. సాంప్రదాయ రకాల పంటలు, తృణధాన్యాలు, మినుములలో విత్తన లభ్యతను పెంపొందించడంలో ఈ పథకం ఎంత వరకు సహాయ పడుతుందో తెలియజేయాలన్నారు.

error: Content is protected !!