News March 5, 2025
అల్లూరి: ఈనెల కూడా పప్పూ.. పంచదార లేదు..!

అల్లూరి జిల్లాలో కందిపప్పు, పంచదార ఈనెల కూడా చౌక డిపోలకు చేరలేదు. జిల్లా ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ఇంటింటికీ బియ్యం మాత్రమే ఇస్తున్నారు. దీంతో తెల్ల రేషన్ కార్డు హోల్డర్స్‌కు నిరాశ తప్పలేదు. జిల్లాలో మొత్తం 671 చౌక దుకాణాలు ఉన్నాయి. వీటి ద్వారా సరఫరా చేసేందుకు 298 టన్నుల కందిపప్పు, 168 టన్నుల షుగర్ అవసరం. కాగా ఈ నెల కందిపప్పు ఇంకా సరఫరా కాలేదని జిల్లా సివిల్ సప్లై మేనేజర్ గణేశ్ కుమార్ అన్నారు.
Similar News
News November 6, 2025
కరీంనగర్: BANK JOBS.. నేడే LAST DATE..!

జిల్లా కో-ఆపరేటివ్ బ్యాంకుల్లోని STAFF ASSISTANT పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. కరీంనగర్‌లో 43 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
అర్హతలు:
* రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ సర్టిఫికేట్ మస్ట్
* అభ్యర్థి వయసు 18- 30 ఏళ్లలోపు ఉండాలి (రిజర్వేషన్ల ఆధారంగా AGE EXEMPTION)
* ఆన్‌లైన్ పరీక్ష, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థి ఎంపిక ఉంటుంది
* వెబ్‌సైట్ https://tgcab.bank.in/ SHARE IT.
News November 6, 2025
హనుమకొండ డైట్‌లో గెస్ట్ ఫ్యాకల్టీ నియామకాలు

హనుమకొండ ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణా సంస్థ (డైట్)లో ఖాళీగా ఉన్న గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులను తాత్కాలికంగా భర్తీ చేసేందుకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఎండీ అబ్దులై తెలిపారు. ఈ నెల 7 నుంచి 13 వరకు దరఖాస్తులు స్వీకరించి, 15న ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. ఎంపికైనవారు ఈ నెల 17న రిపోర్టు చేయాలని, గౌరవ వేతనం రూ.15,600–23,400గా నిర్ణయించామని పేర్కొన్నారు.
News November 6, 2025
సత్యసాయి బాబా సూక్తులు

● నీకు హాని చేసిన వారిని కూడా నువ్వు క్షమించాలి
● పరస్పర ప్రేమను అలవర్చుకోండి. ఎప్పుడూ ఆనందంగా, ముఖంపై మధురమైన చిరునవ్వుతో ఉండండి
● ఎప్పుడూ ఎవరి గురించి చెడుగా మాట్లాడకు
● ఎలాంటి కష్టాలు వచ్చినా భగవంతుడిపై విశ్వాసం కోల్పోకూడదు, విశ్వాసం ఉంటే ఎంతైనా సాధించొచ్చు.


