News June 26, 2024
అల్లూరి ఒకటి.. విశాఖకి 13.. 24వ స్థానంలో అనకాపల్లి

➤ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సప్లిమెంటరీ పరీక్షలకు అల్లూరి జిల్లాలో 2,655 మంది విద్యార్థులకు 1,766 మంది పాసయ్యారు. 67 శాతంతో రాష్ట్రంలో ఒకటో స్థానంలో నిలిచింది.
➤ విశాఖ జిల్లాలో 7,984 మంది విద్యార్థులు హాజరవ్వగా 3,407 మంది పాసయ్యారు. 43 శాతం ఉత్తీర్ణతతో జిల్లా 13వ స్థానంలో నిలిచింది.
➤ అనకాపల్లి జిల్లాలో 4,411 మందికి 1,504 మంది ఉత్తీర్ణత సాధించారు. 34 శాతం ఉత్తీర్ణతతో జిల్లా 24వ స్థానంలో నిలిచింది.
Similar News
News October 21, 2025
వ్యాపారులు డస్ట్ బిన్లు ఉపయోగించాలి: జీవీఎంసీ కమిషనర్

వ్యాపారులు దుకాణాల ముందు డస్ట్ బిన్లు ఉపయోగించాలని, లేనియెడల వారి లైసెన్సులు రద్దు చేస్తామని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ హెచ్చరించారు. మంగళవారం ఆరిలోవలో పర్యటించి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. మాంసం, పూల వ్యాపారులు వ్యర్థాలను రోడ్లపై వేయడంతో వారిచేత క్లీన్ చేయించారు. టిఫిన్ సెంటర్ వద్ద డస్ట్ బిన్ లేకపోవడంతో రూ.1000 అపరాధ రుసుమును వసూలు చేయాలని శానిటరీ ఇన్స్పెక్టర్ను ఆదేశించారు.
News October 21, 2025
సింహాచలం దేవస్థానం ఇన్ఛార్జ్ ఈవోగా సుజాత

సింహాచలం దేవస్థానం ఇన్ఛార్జ్ ఈవోగా ప్రస్తుతం జోనల్ డిప్యూటీ కమిషనర్గా విధులు నిర్వహిస్తున్న సుజాతకు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం ఇన్ఛార్జ్ ఈవోగా వ్యవహరిస్తున్న త్రినాథరావు రిలీవ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులును ప్రభుత్వం జారీ చేసింది.
News October 21, 2025
విశాఖ జూపార్క్ సమీపంలో వ్యక్తి ఆత్మహత్య

విశాఖ జూ పార్క్ సమీపంలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. డెయిరీ ఫారం నుంచి ఎండాడ వైపు వెళ్తున్న జాతీయ రహదారి పక్కన చెట్టు కొమ్మకు ఓ వ్యక్తి ఉరివేసుకున్నాడు. అటుగా వెళ్తున్న వారు ఈ దృశ్యాన్ని చూసి భయాందోళన చెందారు. వీరి సమాచారంతో ఆరిలోవ పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.