News June 26, 2024

అల్లూరి ఒకటి.. విశాఖకి 13.. 24వ స్థానంలో అనకాపల్లి

image

➤ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సప్లిమెంటరీ పరీక్షలకు అల్లూరి జిల్లాలో 2,655 మంది విద్యార్థులకు 1,766 మంది పాసయ్యారు. 67 శాతంతో రాష్ట్రంలో ఒకటో స్థానంలో నిలిచింది.
➤ విశాఖ జిల్లాలో 7,984 మంది విద్యార్థులు హాజరవ్వగా 3,407 మంది పాసయ్యారు. 43 శాతం ఉత్తీర్ణతతో జిల్లా 13వ స్థానంలో నిలిచింది.
➤ అనకాపల్లి జిల్లాలో 4,411 మందికి 1,504 మంది ఉత్తీర్ణత సాధించారు. 34 శాతం ఉత్తీర్ణతతో జిల్లా 24వ స్థానంలో నిలిచింది.

Similar News

News February 14, 2025

విద్యార్థి మృతిపై నివేదిక ఇవ్వండి: బాలల హక్కుల కమిషన్

image

మధురవాడ లో ఇంటర్ విద్యార్థి మేడపై నుంచి దూకి మృతి చెందిన ఘటనపై పోలీస్, ఇంటర్ విద్యాశాఖ అధికారులు నివేదిక అందించాలని ఏపీ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు గొండు సీతారాం ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఆయన గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఒత్తిడి వల్ల చనిపోయాడా, ఇతర కారణాలు వల్ల చనిపోయామా అనే కోణంలో దర్యాప్తు చేపట్టాలని సూచించారు.

News February 13, 2025

ఏలూరులో వందే భారత్‌కు అదనపు హాల్ట్ కొనసాగింపు

image

విశాఖ – సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు (20707/08)కు ఏలూరు రైల్వే స్టేషన్‌లో అదనపు హాల్ట్ మరో ఆరు నెలలు కొనసాగుతుందని వాల్తేరు డివిజన్ డిసిఎం సందీప్ గురువారం తెలిపారు. ఏలూరు రైల్వే స్టేషన్‌లో ఒక నిమిషం పాటు రైలు ఆగనున్నట్లు తెలిపారు. ఈ హాల్ట్ ఇరువైపులా ఉంటుందన్నారు. ప్రయాణికుల విషయాన్ని గమనించాలన్నారు.

News February 13, 2025

ఉత్త‌రాంధ్ర టీచర్ MLC బ‌రిలో 10 మంది

image

ఉత్త‌రాంధ్ర టీచర్ MLC స్థానానికి 10మంది పోటీలో ఉన్నట్లు ఎన్నికల అధికారి హ‌రేంధిర ప్ర‌సాద్ తెలిపారు. 10మంది నామినేషన్ వెయ్యగా.. ఏ ఒక్కరూ ఉపసంహరించుకోలేదన్నారు. ఈనెల 27న పోలింగ్ జరగనుండగా.. మార్చి 3న కౌంటింగ్ ఉండనుంది. 12 ఎంసీసీ బృందాలు, 11 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థులతో గురువారం ఆయన సమావేశమయ్యారు. నేర చరిత్ర లేనివారిని ఏజెంట్లుగా నియ‌మించుకోవాలని సూచించారు. 

error: Content is protected !!