News February 13, 2025

అల్లూరి: ఒకే ఊరు.. రెండు మండలాలు..!

image

తమ గ్రామంలో అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేయాలని రాజవొమ్మంగి మండలం రాజుపేట గిరిజనులు కోరుతున్నారు. ఐదేళ్లలోపు 32మంది బాలలు ఉన్నారన్నారు. రెండు వీధులుగా ఉన్న తమ గ్రామంలో ఎగువవీధి కొయ్యూరు మండలంలోకి.. దిగువ వీధి రాజవొమ్మంగి మండలంలోకి వస్తుందని చెప్తున్నారు. అనేకసార్లు రెండు మండలాల అధికారులకు విన్నవించుకున్నామని తెలిపారు. చేసేదిలేక చిన్నారులను పనుల వద్దకు తీసుకుపోతున్నామని తమ ఆవేదనను వెలిబుచ్చుకున్నారు.

Similar News

News October 31, 2025

సీఎం చంద్రబాబుపై జగన్ వ్యాఖ్యలు సరికాదు: తిక్కారెడ్డి

image

‘మొంథా’ తుఫాను సమయంలో ప్రజలను కాపాడిన సీఎం చంద్రబాబు నాయకత్వాన్ని జగన్ తప్పుబట్టడం ఆశ్చర్యకరమని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి శుక్రవారం విమర్శించారు. తుఫాన్ సమయంలో ప్రాణ నష్టం లేకుండా చూసిన చంద్రబాబుపై వ్యాఖ్యలు చేయడం జగన్‌కు తగదన్నారు. సీఎంగా ఉన్నప్పుడు తుఫాన్లు వచ్చినా గడప దాటని జగన్, ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆయన ఒక ప్రకటనలో మండిపడ్డారు.

News October 31, 2025

మళ్లీ పెరిగిన బంగారం ధరలు!

image

బంగారం ధరలు గంటల వ్యవధిలోనే <<18156666>>మరోసారి<<>> పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ ఇవాళ మొత్తంగా రూ.1,800 పెరిగి ₹1,23,280కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,650కు ఎగబాకి రూ.1,13,000 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.1,65,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News October 31, 2025

BREAKING: భారత్ ఓటమి

image

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో టీమ్ ఇండియా ఓటమి పాలైంది. భారత్ నిర్దేశించిన 126 పరుగుల టార్గెట్‌ను 6 వికెట్లు కోల్పోయి 13.2 ఓవర్లలోనే ఆసీస్ ఛేదించింది. మార్ష్ 46, ట్రావిస్ హెడ్ 28, ఇంగ్లిస్ 20 పరుగులతో రాణించారు. వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, బుమ్రా తలో 2 వికెట్లు తీశారు. మొదటి టీ20 రద్దవ్వగా.. మూడో టీ20 నవంబర్ 2న జరగనుంది.