News February 3, 2025
అల్లూరి: కృష్ణా నదిని ఈదేశిన తండ్రీకూతురు

విజయవాడలో ఆదివారం నిర్వహించిన కృష్ణానది క్రాసింగ్ ఈత పోటీల్లో కూనవరం మండలం పల్లూరుకి తండ్రీ కూతురు సత్తా చాటారు. గ్రామానికి చెందిన ఆవుల సంతోష్ కుమార్ (35) అతని కుమార్తె ఆవుల శాన్వి(13) 1.5 కిలోమీటర్ల కృష్ణా నదిని విజయవంతంగా ఈదేశారు. తొలిసారి పోటీల్లో పాల్గొన్న శాన్వి 31.5 నిమిషాల్లో తన లక్ష్యాన్ని పూర్తి చేసింది. సంతోష్ 36.45 నిమిషాల్లో క్రాస్ చేయగా.. అతను ఈ పోటీలో పాల్గొనడం ఇది మూడోసారి.
Similar News
News February 17, 2025
ప్రార్థనా స్థలాల చట్టం కేసు: సుప్రీంకోర్టు అసంతృప్తి

ప్రార్థనా స్థలాల చట్టం కేసుపై కుప్పలు తెప్పలుగా కొత్త పిటిషన్లు రావడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. గతంలో ముగ్గురు సభ్యుల బెంచ్ వాదనలు వినడంతో ఇద్దరితో కూడిన తమ బెంచ్ పెండింగ్ పిటిషన్లను తీసుకోబోదని CJI సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. ‘పిటిషన్లు వేయడానికీ ఓ పరిమితి ఉంటుంది. తాజాగా మరిన్ని వచ్చాయి. వాటిని మేం స్వీకరించలేం. మార్చిలో కొత్త తేదీ ఇస్తాం’ అని తెలిపారు.
News February 17, 2025
వరంగల్: మక్కలు క్వింటా రూ.2,355

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు సోమవారం మొక్కజొన్న తరలివచ్చింది. అయితే గత శుక్రవారం లాగే ఈరోజు కూడా మక్కలు (బిల్టీ) ధర రూ.2,355 ధర పలికింది. అలాగే సూక పల్లికాయ ధర రూ.7200, పచ్చి పల్లికాయకి రూ.4,100 ధర వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు. మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.
News February 17, 2025
కేసీఆర్ అంటే తెలంగాణ ఉద్వేగం: హరీశ్‌రావు

బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు 71వ పుట్టినరోజు సందర్భంగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ‘కేసీఆర్ అంటే తెలంగాణ ఉద్వేగం, ఉద్రేకం, తెలంగాణ స్వాభిమానం, జై తెలంగాణ యుద్ధ నినాదం, తెలంగాణ సమున్నత అస్తిత్వం అన్నారు. మీరు శత వసంతాలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా’ అంటూ హరీశ్ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు.