News March 2, 2025
అల్లూరి: చెట్టుపై నుంచి పడి ఒకరి మృతి

ముంగర్లపాలెంలో చెట్టుపై నుంచి పడి ఓ వ్యక్తి మృతి చెందినట్లు గొలుగొండ ఎస్ఐ పీ.రామారావు ఆదివారం తెలిపారు. జీ మాడుగుల మండలం గడుతూరుకు చెందిన గెమ్మెలి శేఖర్ తన చిన్నాన్న గ్రామమైన మండలంలోని సీతకండికి కూలీ పనుల నిమిత్తం వచ్చాడు. ఈ క్రమంలో ముంగర్లపాలెంలో చింతచెట్టు ఎక్కగా చెట్టుపై నుంచి పడిపోవడంతో మృతి చెందాడు. దీంతో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని బంధువులకు అప్పగించామని చెప్పారు.
Similar News
News December 10, 2025
గోదావరి క్రీడా సంబరాలపై అధికారులతో జేసీ సమీక్ష

గోదావరి క్రీడా సంబరాల భాగంగా నిర్వహిస్తున్న పోటీల్లో పాల్గొనే క్రీడాకారుల టీంల ఎంపికను ప్రారంభించాలని జేసీ రాహుల్ అన్నారు. బుధవారం జేసీ ఛాంబర్లో గోదావరి క్రీడా సంబరాల ఏర్పాట్లపై డీఆర్ఓ, ఆర్డీవోలు, వివిధ శాఖల జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ క్రీడల్లో పాల్గొనేందుకు 3,300 మంది అధికారులు, ఉద్యోగులు నమోదు చేసుకున్నారన్నారు. క్రికెట్, క్యారమ్స్, టెన్నిస్ విభాగాల్లో ఆడేందుకు ఆసక్తి చూపిస్తున్నారన్నారు
News December 10, 2025
VJA: భవానీ భక్తులకు ప్రత్యేక క్యూలైన్ల ఏర్పాటు

ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్ష విరమణ సందర్భంగా తరలివచ్చే భక్తులకు అసౌకర్యం తలెత్తకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. వినాయకుడి గుడి నుంచి టోల్గేట్ మీదుగా కొండపై ఓం టర్నింగ్ వరకు 3 క్యూలైన్లు, ఓం టర్నింగ్ వద్ద అదనపు లైన్లతో కలిపి 5 క్యూలైన్లు ఏర్పాటు చేశారు. దీక్షల విరమణ రోజుల్లో టికెట్ దర్శనాలకు అనుమతి లేదు. దర్శనానంతరం భక్తులు శివాలయం మెట్ల మార్గం ద్వారా దిగివెళ్లేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
News December 10, 2025
కామారెడ్డి: చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి: జడ్జి

ప్రపంచ మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని హ్యూమన్ రైట్స్ హెల్త్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం కామారెడ్డిలో చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి, సివిల్ జడ్జి నాగరాణి హజరయ్యారు. ఆమె మాట్లాడుతూ.. ప్రతి పౌరుడు తమ హక్కులు, బాధ్యతల పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.


