News March 25, 2024
అల్లూరి: చెట్టు నిండా తేనెపట్లే
సాధరణంగా జనావాసంలో ఉన్న పెద్ద చెట్లకు 5 వరకు తేనెపట్లు ఉంటాయి. అదే అటవీ ప్రాంతాల్లో అయితే కొంచెం ఎక్కువగానే ఉంటాయి. కానీ అల్లూరి జిల్లాలో మాత్రం అందుకు భిన్నంగా ఉంది. డుంబ్రిగూడ మండలం కొర్రాయి కొత్తవలస గ్రామంలో జనావాసాలను ఆనుకుని ఉన్న ఓ భారీ చెట్టు నిండుగా తేనెపట్లే ఉన్నాయి. ప్రతి కొమ్మకూ తేనెపట్లు ఉంటూ.. మొత్తంగా 100కు పైగా తేనెపట్లు ఉండటం విశేషం.
Similar News
News September 17, 2024
ఈ నెల 19న విశాఖకు గవర్నర్ రాక
ఈనెల 19వ తేదీన రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ విశాఖ రానున్నారు. హైదరాబాద్ నుంచి విమానంలో మధ్యాహ్నం 3.50 గంటలకు ఆయన విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నోవాటెల్‌కు వెళతారు. సాయంత్రం ఏయూలో నిర్వహించే దివ్య కల మేళాలో ఆయన పాల్గొంటారు. తిరిగి నొవాటెల్ కు చేరుకొని రాత్రి అక్కడ బస చేస్తారు. 20వ తేదీ సాయంత్రం విమానంలో ఆయన విజయవాడ వెళతారు.
News September 16, 2024
విశాఖ-దుర్గ్ వందేభారత్ టైమింగ్స్ ఇవే
విశాఖ నుంచి దుర్గ్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ వారంలో గురువారం మినహా ఆరు రోజులు నడపనున్నారు. 20829 నంబర్‌తో దుర్గ్‌లో ఉ.5:45కి బయలుదేరి అదే రోజు మ.1:45 నిమిషాలకు విశాఖ చేరుకుంటుంది. విశాఖ నుంచి 20830 నంబర్‌తో మ.1:50 నిమిషాలకు బయలుదేరి అదే రోజు రాత్రి 11:50 నిమిషాలకు దుర్గ్ చేరుకుంటుంది. ఈనెల 20వ నుంచి ఈ రైలు రెగ్యులర్‌గా తిరుగుతుందని ఈస్ట్ కోస్ట్ రైల్వే డీఆర్ఏం తెలిపారు.
News September 16, 2024
జీకే.వీధి: పచ్చకామెర్లతో విద్యార్థిని మృతి.?
గూడెం కొత్తవీధి మండలంలో మరో విషాదం నెలకొంది. ఆర్వీ నగర్ బాలికల ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదో తరగతి విద్యార్థిని జంపారంగి.ధార అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం విశాఖ కేజీహెచ్‌లో చేరింది. అక్కడ చికిత్స పొందుతూ.. సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచినట్లు టీడీపీ నేత సత్తిబాబు తెలిపారు. పచ్చకామెర్లతో బాలిక మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు.