News February 3, 2025
అల్లూరి: జాబ్ మేళా లో 105మంది ఎంపిక

అల్లూరి జిల్లాలోని చింతూరు గురుకుల పాఠశాలలో పోలీస్ శాఖ సోమవారం నిర్వహించిన జాబ్ మేళాలో 105 మంది ఉద్యోగాలకు ఎంపికైనట్లు పోలీస్ సిబ్బంది తెలిపారు. సెల్ ఫోన్స్ తయారీకి ఎన్నో సోర్స్ అనే సంస్థ వీరందరికి ముందుగా శిక్షణ ఇస్తుందని అన్నారు. విలీన మండలాల్లో పలు గ్రామాలకు చెందిన యువతి, యువకులు ఈ జాబ్ మేళాలో పాల్గొన్నారని చెప్పారు. ఏఎస్పీ పంకజ్ కుమార్ మీనా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
Similar News
News November 21, 2025
వేములవాడ: ఒంటిపై గాయాలతో యువకుడి వీరంగం

సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో సాయి అనే యువకుడు ఒంటిపై గాయాలతో వీరంగం సృష్టించాడు. చొక్కా లేకుండా రక్తం కారుతున్నా అటు, ఇటు తిరుగుతూ హల్చల్ చేశాడు. సదరు యువకుడి చేష్టలతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని, యువకుడిని చికిత్స నిమిత్తం జిల్లా దవాఖానకు తరలించారు. భార్య కాపురానికి రావడం లేదనే సాయి ఇలా ప్రవర్తిస్తున్నాడని తెలిసింది.
News November 21, 2025
కామారెడ్డి: నిఖత్ జరీన్కు కవిత అభినందనలు

మహిళల 51 కేజీల ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్లో బంగారు పతకాన్ని కైవసం చేసుకున్న నిఖత్ జరీన్కు తెలంగాణ జాగృతి చీఫ్ కవిత అభినందనలు తెలిపారు. మీ అచంచలమైన అంకితభావం ప్రతి విజయంలోనూ ప్రతిఫలించింది. ఈ ఘన విజయం భారతదేశానికి ముఖ్యంగా తెలంగాణకు అపారమైన గర్వకారణం అని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మరెన్నో అద్భుతమైన విజయాలను సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ‘X’ వేదికగా ఆమె ట్వీట్ చేశారు.
News November 21, 2025
వరంగల్: ప్రభుత్వ ఉద్యోగులపై దాడి చేస్తే కఠిన చర్యలు

విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్టీసీ సిబ్బంది, వైద్యులు, రెవెన్యూ, పోలీస్ అధికారులను బెదిరించడం, దాడి చేయడం వంటి చర్యలపై వరంగల్ పోలీసు శాఖ తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. ప్రజా సేవల్లో ఉన్న అధికారుల పనిలో జోక్యం చేసుకున్న వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని వరంగల్ పోలీసులు తమ అధికారిక ఫేస్బుక్ అకౌంట్ ద్వారా స్పష్టం చేశారు.


