News February 3, 2025
అల్లూరి: జాబ్ మేళా లో 105మంది ఎంపిక

అల్లూరి జిల్లాలోని చింతూరు గురుకుల పాఠశాలలో పోలీస్ శాఖ సోమవారం నిర్వహించిన జాబ్ మేళాలో 105 మంది ఉద్యోగాలకు ఎంపికైనట్లు పోలీస్ సిబ్బంది తెలిపారు. సెల్ ఫోన్స్ తయారీకి ఎన్నో సోర్స్ అనే సంస్థ వీరందరికి ముందుగా శిక్షణ ఇస్తుందని అన్నారు. విలీన మండలాల్లో పలు గ్రామాలకు చెందిన యువతి, యువకులు ఈ జాబ్ మేళాలో పాల్గొన్నారని చెప్పారు. ఏఎస్పీ పంకజ్ కుమార్ మీనా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
Similar News
News January 22, 2026
కాకినాడ: ఒకే టెంటులో 46 కుటుంబాలు నివాసం.. PHOTO

రౌతులపూడి మండలం సార్లంకలో అగ్నిప్రమాద బాధితులు టెంట్లలో నరకం చూస్తున్నారు. రాత్రి వేళల్లో పాములు, విషపురుగులు సంచరిస్తుండటంతో గిరిజన కుటుంబాలు భయాందోళన వ్యక్తం చేశాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన టెంట్లలో నేలపై పడుకోవడం ప్రాణాపాయంగా మారిందని బాధితులు ఆరోపిస్తున్నారు. తమకు పక్కా ఇళ్లు నిర్మించే వరకు తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేయాలని గ్రామస్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
News January 22, 2026
NZB: ప్రేమించి మోసగించాడు.. చివరికి

పెళ్లి చేసుకుంటానని నమ్మించి, గర్భిణిని చేసి మోసగించిన వ్యక్తికి జిల్లా కోర్టు జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. ధర్పల్లి మండలానికి చెందిన వ్యక్తి ఓ మహిళను మోసగించినట్లు నేరం రుజువు కావడంతో, ప్రత్యేక జడ్జి దుర్గాప్రసాద్ ఈ తీర్పు చెప్పారు. నిందితుడికి కఠిన కారాగార శిక్ష, రూ.11వేల జరిమానా విధిస్తున్నట్లు పేర్కొన్నారు.
News January 22, 2026
నేడు అందుబాటులోకి కళ్యాణోత్సవం టికెట్లు

AP: తిరుమల శ్రీవారి ఏప్రిల్ కోటా కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ టికెట్లను ఈరోజు ఉదయం 10 గంటలకు TTD విడుదల చేయనుంది. వీటితోపాటు వర్చువల్ సేవ టికెట్లను కూడా రిలీజ్ చేస్తోంది. 23న అంగప్రదక్షిణ, శ్రీవాణి ట్రస్టు, 24న (అకామిడేషన్) రూమ్స్, రూ.300 దర్శన టికెట్లు విడుదల చేయనున్నట్టు తెలిపింది. భక్తులు అధికారిక వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.inలో మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించింది.


